Site icon NTV Telugu

Crime : వృద్ధ దంపతుల హత్య.. బంగారం, డబ్బు చోరీ..

Alwalcrime

Alwalcrime

Crime : హైదరాబాద్ అల్వాల్ లో దారుణం చోటు చేసుకుంది. ఇంట్లో ఉంటున్న వృద్ధ దంపతులపై కిరాతకంగా దాడి చేసి చంపేశారు. ఆ తర్వాత బంగారం, డబ్బు దోచుకుని పారిపోయారు. బాలనగర్ డిసిపి ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ ఘటనపై తమకు ఉదయం 8 గంటలకు ఫోన్ వచ్చిందని.. ఘటనా స్థలికి వెళ్లి చూస్తే వృద్ధ దంపతులు నెత్తురోడుతూ చనిపోయి ఉన్నట్టు తెలిపారు. ఉద్దేశ పూర్వకంగానే వారిని చంపినట్టు తెలిపారు. సీన్ ఆఫ్ అఫెన్స్ మా పోలీస్ టీమ్స్ తో పరిశీలించినట్టు వెల్లడించారు.
Read Also : Krithi Shetty : ఉప్పెన పాప.. శకునం అదిరింది

‘రాజయ్య (70), కనకమ్మ (65) దంపతులది భ్రదాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లందు ప్రాంతం. వీరిద్దరూ అల్వాల్ లోని సూర్యనగర్ కాలనీలో కొంత కాలంగా నివసిస్తున్నారు. శనివారం రాత్రి వృద్ధ దంపతులు నిద్ర పోతున్న సమయంలో ఇంట్లోకి కొందరు దుండగులు ప్రవేశించారు . వారి తలలపై కట్టెలతో బలంగా కొట్టి హత్య చేసినట్టు ఆనవాళ్లు ఉన్నాయి. ఆ తర్వాత మృతురాలి ఒంటిపై ఉన్న బంగారు, వెండి ఆభరణాలతో పాటు ఇంట్లో ఉన్న లక్ష రూపాయలను కూడా దోచుకున్నారు’ అంటూ డిసిపి వెల్లడించారు. పాతకక్షలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో విచారణ జరుపుతున్నట్టు వెల్లడించారు. నిందితులను అతిత్వరలోనే పట్టుకుంటామన్నారు.
Read Also : Vicky : రెండు సార్లు జైలుకు వెళ్లిన విక్కికౌశల్..కారణం ఇదే !

Exit mobile version