మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం.. చనిపోయినా వదలకుండా ప్రైవేట్ భాగాలను
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రోజురోజుకు ఆడవారిపై మగవారి అకృత్యాలు ఎక్కువైపోతున్నాయి. కామంతో కళ్ళుమూసుకుపోయి.. ఎలాంటి దారుణాలకైనా ఒడిగడుతున్నారు. వావివరుసలు, చిన్నాపెద్ద మరిచి కామాంధులుగా మారుతున్నారు. తాజాగా ఒక మైనర్ బాలికను సమాజం సిగ్గుతో తలదించుకునేలా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ముగ్గురు వ్యక్తులు. బాలిక మృతిచెందాకా కూడా వారి కామ దాహం తీరలేద. శవంపైన కూడా అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె ప్రైవేట్ భాగాలను ఛిద్రం చేశారు. వింటుంటేనే రక్తం మరిగిపోతుంది కదా.. అలాంటివారిని ఊరి తీయాలని, వారి తరుపున ఏ న్యాయవాది కూడా వాదించేది లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ దారుణ ఘటన రాజస్థాన్ లో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌లోని బుండీకి చెందిన 16 ఏళ్ల మైనర్ బాలిక గత నెల 23 న మేకలు మేపడానికి అడవికి వెళ్లి అదృశ్యమైంది. దీంతో బాలిక మిస్సింగ్ కేసు గా నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా ఇటీవల బాలిక బుండీకి సమీపంలోని అడవుల్లో శవమై కనిపించింది. ఇక ఈ కేసును హత్య కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించగా నమ్మలేని నిజాలు బయటపడ్డాయి.
Also Read
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
- Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
- Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
- Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
బాలికపై సాముహిక అత్యాచారం జరిగిందని, అతి కిరాతకంగా ఆమెను చంపి, ఆపై కూడా కామాంధులు వదలలేదని తేలింది. అంతేకాకుండా ఆమె ప్రైవేట్ భాగాలలో 30 వరకు గాయాలు ఉన్నాయని, బాలిక ఎంతో నరకాన్ని అనుభవించి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఇక ఈ ఘటనపై బుండీ పోలీసులు మాట్లాడుతూ” మా జీవితాలలో ఇలాంటి ఒక ఘటనను చూడలేదు.. బాలిక ఎంతటి నరక యాతన అనుభవించిందో అర్ధం చేసుకోగలరు.. ఆ ముగ్గురు నిందితులను ఉరి తీయాలి” అని తెలిపారు.. లాయర్లు కూడా ఈ ఘటనపై స్పందిస్తూ నిందితులకు సపోర్ట్ గా ఏ ఒక్కరు వాదించబోయేది లేదని తెలిపారు.
తాజావార్తలు
-
Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్
-
SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
-
Congress Protest: రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్..
-
Pakistan-UN: కాశ్మీర్ సమస్య పరిష్కరించండి.. యూఎన్ ముందు పాక్ మళ్లీ దౌత్యం
-
Kishan Reddy : బతుకమ్మపై కిషన్ రెడ్డి పిలుపు.. మహిళలకు బిగ్ మెసేజ్.!
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!