Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లోని దారుణం జరిగింది. మౌగంజ్ జిల్లాలో కదులుతున్న అంబులెన్స్‌లో ఇద్దరు వ్యక్తులు 16 ఏల్ల బాలికను కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన సంచలనం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మౌగంజ్ జిల్లా కేంద్రానికి 30 కి.మీ దూరంలో ఉన్న హనుమాన పోలీస్ స్టేషన్ పరిధిలో నవంబర్ 25న ఈ సంఘటన జరిగింది.
Read Also: Minister Nadendla Manohar: రైతులకు అండగా ఉంటాం.. దళారులను ప్రోత్సహించొద్దు..
ఇద్దరు వ్యక్తులు తనను బలవంతంగా కిడ్నాప్ చేసి జననీ ఎక్స్‌ప్రెస్ అంబులెన్స్‌లో బలవంతంగా ఎక్కించి సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిని ‘‘108 అంబులెన్స్’’ అని కూడా పిలుస్తారు. జననీ ఎక్స్‌ప్రెస్ అంబులెన్స్‌ను మధ్యప్రదేశ్‌లోని గ్రామీణ ప్రాంతాల్లోని తల్లులు, అనారోగ్యంతో ఉన్న శిశువులు, పేద కుటుంబాల అత్యవసర రవాణా సౌకర్యాలను అందించేందుకు ప్రభుత్వం వీటిని నిర్వహిస్తోంది.
నిందితులను వీరేంద్ర చతుర్వేది (అంబులెన్స్ డ్రైవర్), అతని మిత్రుడు రాజేష్ కేతవ్‌గా గుర్తించారు. బుధవారం రాత్రి వీరిద్దరిని అరెస్ట్ చేశారు. నిందితులు మౌగంజ్ జిల్లాలోని నైగర్హి తహసీల్ నివాసితులు. ఘటన జరిగిన ప్రాంతంమైన హనుమాన తహసీన్ నుంచి నిందితులు గ్రామం 50 కి.మీ దూరంలో ఉంది. ‘‘సామూహిక అత్యాచారం జరిగిందని ఆరోపిస్తూ నవంబర్ 25న బాధితురాలు ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. వైద్య పరీక్షల్లో అత్యాచారం జరిగినట్లు నిర్ధారించబడింది మరియు సోదాలు ప్రారంభించబడ్డాయి. నిందితులిద్దరినీ నగరి నుండి బుధవారం అరెస్టు చేశాము’’ అని మౌగంజ ఎస్సీ సర్నా ఠాకూర్ అన్నారు.