Honeymoon Murder: మేఘాలయ హనీమూన్ మర్డర్ గురించి దాదాపుగా అందరికి తెలిసే ఉంటుంది. ఈ హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మధ్యప్రదేశ్ ఇండోర్‌కు చెందిన రాజా రఘువంశీని, అతడి భార్య సోనమ్ రఘువంశీ, ఆమె ప్రియుడు రాజ్ కుశ్వాహా కలిసి దారుణంగా హత్య చేశారు. హనీమూన్ పేరిటి మేఘాలయా తీసుకెళ్లి హతమార్చారు. అయితే, ఈ కేసులో మరోసారి నిందితురాలు సోనమ్ బెయిల్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. బెయిల్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించడం ఇది మూడోసారి. ఈ కేసులో సోనమ్ ప్రధాన నిందితురాలిగా ఉంది.
Read Also: Off The Record: విశాఖలో గూగుల్ కు భూ కేటాయింపు కొత్త మలుపు తిరగబోతుందా?
ఈ కేసులో ఛార్జిషీట్ దాఖలు చేయడంతో, దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. హత్యలో సోనమ్ పాత్రపై విచారణ మరింత తీవ్రమైంది. ఈ కేసుపై రాజా రఘువంశీ సోదరుడు విపిన్ రఘువంశీ మాట్లాడుతూ.. ఆయన సోనమ్ నిర్దోషిత్వాన్ని ప్రశ్నించారు. సోనమ్ హనీమూన్ వెళ్లడానికి ముందే, తన వ్యక్తిగ వస్తువులన్నింటిని రాజ్ కుశ్వాహకు అప్పగించిందని ఆయన ఆరోపించారు. రాజా హత్య తర్వాత, సోనమ్ తన అత్తమామల ఇంటికి రాకుండా, నేరుగా రాజ్ కుశ్వాహ వద్దకు వెళ్లిందని ఆయన చెప్పారు. సోనమ్ చెబుతున్న వాటిని నమ్మడం సాధ్యం కాదని చెప్పారు. బెయిల్ పిటిషన్‌లో తాను రాజాతో వివాహంపై సంతోషంగా ఉన్నానని చెప్పింది. అయితే, సోనమ్ ఎప్పుడూ ఆనందం అనే ముసుగు వేసుకుని ఉండేదని విపిన్ ఆరోపించాడు. హనీమూన్‌కు రాజా వెళ్లకూడదని అనుకున్నప్పటికీ, బలవంతంగా సోనమ్ టికెట్స్ బుక్ చేయించిందని, ఇది ముందస్తు ప్రణాళికలో భాగమే అని అతను చెప్పాడు.
హత్య తర్వాత, ఆమె ఎవరి సాయం కోరకుండా షిల్లాంగ్ నుంచి ఇండోర్ ప్రయాణించిందని, అత్తమామల ఇంటికి రాకుండా రాజ్ కుశ్వాహా ఇంటికి ఎందుకు వెళ్లిందని విపిన్ ప్రశ్నించారు. రాజ్‌ను సోనమ్ తన సోదరుడిగా భావించినట్లయితే, హత్య తర్వాత అతనితో ఎందుకు దాక్కుంది? అని అడిగాడు. రాజా రఘువంశీ తండ్రి అశోక్ రఘువంశీ కూడా ఇలాంటి ప్రశ్నల్నే లేవనెత్తారు. ఆమెకు జీవిత ఖైదు లేదా మరణశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. గత మూడేళ్లుగా సోమన్, రాజ్ కుశ్వాహాలు రిలేషన్‌లో ఉన్నారని ఆరోపించారు.
