UP: తోడబుట్టిన సోదరుడి ప్రాణాలు కాపాడుకునేందుకు ఓ మహిళ సొంత భర్త ఇంట్లోనే దొంగతనానికి పాల్పడింది. ఈ ఘటన మీరట్‌లో జరిగింది. స్థానిక వస్త్ర వ్యాపారి ఇంటి నుంచి రూ.30 లక్షలు దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. విచారణలో ఆయన భార్యే నిందితురాలు అని తేలింది. తన సోదరుడి ప్రాణాలు రక్షించేందుకు మూత్రపిండాల చికిత్స కోసం ఆమె ఈ దొంగతనానికి పాల్పడింది.
అక్టోబర్ 15న వస్త్రవ్యాపారి పియూష్ మిట్టల్ ఇంట్లో దొంగతనం జరిగింది. దాదాపు రూ,. 30 లక్షల విలువైన రూ.50,000 నగదు, నగలు దొంగిలించబడ్డాయి. ఫిర్యాదు తర్వాత సీసీటీవీ నిఘా ఫుటేజ్ విశ్లేషణతో పోలీసులు విచారణ ప్రారంభించారు. దర్యాప్తులో వ్యాపారి భార్య పూజా మిట్టల్(32), ఆమె అత్త అనిత(53), బావమరింది రవి బన్సాల్(36), రవి బావమరిది దీపక్(24)లు నిందితులుగా తేలింది. వీరందరిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Read Also: Crime: ఫ్రెండ్ తల్లితోనే ఎఫైర్.. చూసి తట్టుకోలేని కొడుకు ఏం చేశాడంటే..
దొంగిలించిన ఆస్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆరు నెలల క్రితం పియూష్‌ను పూజా రెండో వివాహం చేసుకంది. ఇది పియూష్‌కు మూడో వివాహం. పూజా ఆర్థికంగా ఇబ్బందులు కలిగిన కుటుంబం నుంచి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఆమె సోదరుడు రవికి ఇటీవల మూత్ర పిండాలు వైఫల్యమయ్యాయి. దీంతో పూజా భర్త ఇంట్లోనే దొంగతనానికి ప్లాన్ చేసింది. భార్య కదా అని రవి, పూజకు ఇళ్లు ఎప్పుడు ఖాళీగా ఉంటుంది, లాకర్ కీ ఎక్కడ ఉందనే వివరాలు చెప్పాడు. అయితే, ఈ విషయాలను పూజ, దీపక్‌తో పంచుకుంది. రవి, పూజా షాపింగ్ కోసం బయటకు వెళ్లిన సమయంలో దొంగతనం చేశారు.
