Site icon NTV Telugu

Meerut Murder: “గుండెలో పొడిచి, డ్రమ్‌లో పట్టేందుకు శరీర భాగాలు కట్”.. పోస్టుమార్టంలో భార్య, ప్రియుడి పైశాచికం..

Meerut Murder

Meerut Murder

Meerut Murder: మీరట్ మర్చంట్ నేవీ అధికారి సౌరభ్ రాజ్‌పుత్ దారుణహత్యలో భార్య ముస్కాన్ రస్తోగి, ఆమె ప్రియుడు సాహిల్ శుక్లాల పైశాచికం వెలుగులోకి వస్తుంది. పోస్టుమార్టం నివేదికలో వీరిద్దరు ఎంత క్రూరంగా హత్యకు పాల్పడ్డారనే విషయం తెలిసింది. మార్చి 04న భార్య సౌరభ్‌కి మత్తు మందు ఇచ్చి, కత్తితో పొడిచి హత్య చేశారు. శరీర భాగాలను భాగాలుగా కోసి, వాటిని డమ్ములో సిమెంట్ ఇసుకతో కప్పేశారు. విదేశాల్లో పనిచేసే సౌరభ్, తన 6 ఏళ్ల కుమార్తె పుట్టిన రోజు కోసం ఇండియాకు వచ్చిన సమయంలో ఈ హత్య జరిగింది. హత్య తర్వాత, నిందితులిద్దరూ మనాలీ విహారయాత్రకు వెళ్లడం, హోలీని ఘనంగా సెలబ్రేట్ చేసుకున్న వీడియోలు ప్రస్తుతం వైరల్ అయ్యాయి.

Read Also: Husband Suicide: ‘‘నా చావుకు భార్య, అత్త కారణం’’.. వేధింపులకు మరో భర్త బలి..

పోస్టుమార్టం నివేదికలో.. సౌరభ్ తల తెగిపోయిందని, అతడి చేతులు మణికట్టు వరకు నరికేయబడ్డాయని, అతడి కాళ్లు వెనకకు వంగి ఉన్నాయని వెల్లడించింది. అతడి ఛిద్రమైన శరీరాన్ని డ్రమ్‌లో అమర్చడానికి ప్రయత్నించినట్లు ఉన్నట్లు తేలింది. మరణానికి కారణం షాక్, అధిక రక్తస్రావం అని తేలింది. మార్చి 18న రాజ్‌పుత్ కుటుంబం సౌరభ్ కనిపించడం లేదని ఫిర్యాదు చేయడంతో హత్య విషయం వెలుగులోకి వచ్చింది. పోస్టుమార్టం నివేదికలో సౌరభ్ గుండెపై 3 సార్లు తీవ్రమైన శక్తితో పొడిచి చంపినట్లు తేలింది.

సిటీ ఎస్పీ ఆయుష్ విక్రమ్ సింగ్.. ముస్కాన్ సౌరభ్ గుండెపై పొడిచిందని, మెడను కోసి, చేతులు నరికేసినట్లు పేర్కొన్నారు. మృతదేహం డ్రమ్‌లో సరిపోయేలా నాలుగు ముక్కలుగా నరికేశారని చెప్పారు. నేరాన్ని దాచడానికి డ్రమ్ముని సిమెంట్‌తో నింపారని, ఇది శరీరం కుళ్లిపోకుండా, బలమైన వాసన రాకుండా నిరోధించినట్లు ఆయన చెప్పారు. శరీర అవశేషాలను తిరిగి పొందడానికి గట్టిపడిన సిమెంట్‌ని చాలా కష్టపడాల్సి తొలగించారు.

Exit mobile version