Site icon NTV Telugu

Medipally Murder Case : మేడిపల్లి మర్డర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి

Dcp Padmaja

Dcp Padmaja

Medipally Murder Case : హైదరాబాద్‌లోని మేడిపల్లి ప్రాంతంలో చోటుచేసుకున్న భయంకర హత్య కేసు చుట్టూ ఒక్కొక్కటిగా షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త మహేందర్ రెడ్డి, ఆమెను దారుణంగా హతమార్చి శరీరాన్ని ముక్కలుగా చేసిన ఘటన స్థానికులను, పోలీసులను దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఈ ఘటనపై మల్కాజిగిరి డీసీపీ పద్మజా మీడియాకు వివరాలు తెలిపారు. భార్య స్వాతి గర్భవతి అయినప్పటి నుంచే మహేందర్ రెడ్డికి అనుమానం మొదలైంది. మొదటి గర్భాన్ని తీయించాడు. రెండోసారి కూడా స్వాతి గర్భవతి కావడంతో, ఆ గర్భం తన వల్ల రాలేదని అనుమానించి తరచూ గొడవలు పెట్టేవాడు. స్వాతి పంజాగుట్టలోని ఓ కాల్ సెంటర్‌లో టెలికాలర్‌గా పని చేస్తుండగా, ఇంట్లో ఎప్పుడూ ఫోన్‌లో మాట్లాడుతుందనే కారణంతో కూడా అనుమానం పెంచుకున్నాడు.

Nizamabad : నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ ఘర్షనకు దిగిన సీనియర్,జూనియర్ మెడికోలు

అయితే.. దంపతుల నడుమ తరుచూ గొడవులు జరుగుతుండేవి. ఈ నెల22న కూడా గొడవ జరిగింది. స్వాతి గర్భవతి, మెడికల్‌ చెకప్‌కి తీసుకెళ్లమని అడిగింది. ఈ విషయంలోనే మొదలై గొడవ పెద్దగా అయ్యింది. ఈ కారణంగానే స్వాతిని హతమార్చాలని మహేందర్ రెడ్డి ముందే ప్లాన్ చేశాడు. బోడుప్పల్‌లో హాక్సా బ్లేడ్ కొనుగోలు చేసి, రాత్రి భార్యను గొంతు నులిమి చంపేశాడు. చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత, హాక్సా బ్లేడ్‌తో స్వాతి శరీరాన్ని ముక్కలు చేశాడు. తల, చేతులు, కాళ్లు వేర్వేరుగా ముక్కలు చేసి, మూడు కవర్లలో చుట్టి మూసీ నదిలో పడేశాడు. మూడు సార్లు వెళ్ళి శరీర భాగాలను పడేసిన తర్వాత, తన చెల్లికి ఫోన్ చేసి “నా భార్య మిస్సైంది” అని చెప్పాడు. దీంతో బావ గోవర్ధన్ రెడ్డి, మహేందర్ దగ్గరకు వచ్చాడు. అయితే.. మహేందర్ రెడ్డి ప్రణాళికబద్ధంగా హత్య చేసినట్లు తేలిందని, కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు డీసీపీ పద్మజా చెప్పారు.

Missing Plane Mystery: జాడలేని విమానం .. 22 రోజులుగా మిస్సింగ్..

 

Exit mobile version