Site icon NTV Telugu

Medchal Murder Case: మేడ్చల్‌ మహిళ మర్డర్ కేసును ఛేదించిన పోలీసులు..

Medchal Murder Case

Medchal Murder Case

మేడ్చల్ జిల్లా మునీరాబాద్‌ సమీపంలో ఓఆర్‌ఆర్‌ కల్వర్టు కింద జరిగిన మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ హత్య కేసులో పోలీసులు మహిళను గుర్తించారు. నిజామాబాద్ జిల్లా బోధన్‌కి చెందిన శివ నందగా పోలీసులు గుర్తు పట్టారు. మహిళ శివ నందకు ముగ్గురు పిల్లలు ఉన్నట్లు తెలుసుకున్నారు. అయితే.. హనుమకొండ జిల్లా కమలాపూర్‌కి చెందిన షేక్ ఇమామ్ అనే వ్యక్తితో కలిసి మేడ్చల్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. మునీరాబాద్‌లోని ఓ మెడికల్ షాప్‌లో కండోమ్స్ కొన్నట్లు కనుగొన్నారు. అక్కడి నుంచి నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లిన ఆ ఇద్దరు.. వారి మధ్య గొడవ జరగడంతోనే మహిళను చంపినట్లు పోలీసులు గుర్తించారు. కాగా.. మహిళను దారుణంగా హత్య చేసిన నిందితుడిని పట్టుకున్నారు. ఈ రోజు ఉదయం మేడ్చల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Read Also: Chandigarh Mayoral Poll: చండీగఢ్ మేయర్ ఎన్నిక ముందు కాంగ్రెస్‌కి భారీ షాక్.. బీజేపీ ఫుల్ హ్యాపీ..

కాగా.. ఈ నెల 24న మేడ్చల్ జిల్లాలోని మునీరాబాద్ ప్రాంతంలో ఈ హత్య ఘటన బయటపడింది. మహిళను బండరాళ్లతో కొట్టి హత్య అనంతరం.. పోలీసులకు క్లూస్‌ దొరక్కుండా ఉండేందుకు మృతదేహంపై పెట్రోల్ పోసి తగులబెట్టాడు నిందితుడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరించారు. మని అని యువతి చేతిపై శ్రీకాంత్ అని తెలుగులో నరేందర్ అని ఇంగ్లీష్‌లో టాటూ ఉన్నట్లు క్లూస్ టీమ్స్ గుర్తించారు. తాజాగా.. ఈ హత్య కేసుకు సంబంధించి పోలీసులు ఛేదించారు.

Read Also: Kerala man-eater tiger: వయనాడ్‌లో మనుషులను చంపి తింటున్న పులి మృతి

Exit mobile version