Robbery: భారీ దోపిడీ కేసు ఛేదించిన పోలీసులు.. కిలో బంగారం, వెండి స్వాధీనం.. ఒకే కుటుంబంలో నలుగురు దొంగలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట మండలం చీలపల్లిలో ఈ నెల 14న జరిగిన భారీ దోపిడీ కేసును జిల్లా పోలీసులు అత్యంత చాకచక్యంగా ఛేదించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు ప్రెస్ మీట్ ద్వారా అధికారికంగా వెల్లడించారు. ఈ భారీ చోరీకి పాల్పడింది ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులుగా పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి సుమారు ఒక కిలో బంగారు ఆభరణాలు, 1.7 కిలోల వెండి ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం బిబ్యా నాయక్ తండాకు చెందిన జైరాం నాయక్ (45) జాదవ్ ఈ ముఠాకు ప్రధాన సూత్రధారి. సహచరుడిగా తన బావ ఇప్పు సింగ్ (32) తో కలిసి నేరాలకు పాల్పడేవాడు. దొంగిలించిన బంగారు, వెండి ఆభరణాలను జైరాం తన తల్లి మాలి (80), చెల్లి సాంకి బాయి (28) లకు అప్పగించేవాడు. వారు ఆ సొత్తును గుట్టుచప్పుడు కాకుండా దాచిపెట్టేవారు.
Also Read
- US Crime: ప్రెగ్నెంట్ కూతురి హత్య కేసులో సంచలనం.. కాబోయే అల్లుడితో తల్లికి లైంగిక సంబంధం!
- Bengaluru: ఖాళీ స్థలాన్ని క్లీన్ చేస్తుండగా మహిళ మృతదేహం.. 20 రోజుల తర్వాత వీడిన మర్డర్ మిస్టరీ..
- AP Crime: కళ్యాణి హత్య కేసులో షాకింగ్ విషయాలు.. మటన్‌తో కొట్టే కత్తులతో ముక్కలుగా నరికి కెనాల్లో పడేశారు..!
- Bihar Girl Harassment: బీహార్‌లో వరుస ఘటనలు.. తాజాగా టూరిస్ట్ స్పాట్లో బాలికకు వేధింపులు.. వీడియో వైరల్
పోలీసులకు దొరికారిలా..
ఈ నెల 14న జరిగిన చోరీ కేసు విషయమై అడ్వకేట్‌తో మాట్లాడేందుకు వెళ్తుండగా.. రామాయంపేట్ వద్ద జైరాం నాయక్‌ను పోలీసులు వ్యూహాత్మకంగా పట్టుకున్నారు. ప్రస్తుతం ప్రధాన నిందితుడు జైరాం జాదవ్, అతని తల్లి మాలి బాయిని పోలీసులు అరెస్ట్ చేయగా.. జైరాం బావ ఇప్పు సింగ్, చెల్లె సాంకి బాయి ప్రస్తుతం పరారీలో ఉన్నారు. పట్టుబడిన ఈ కిలాడీ ముఠాపై మెదక్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో కలిపి మొత్తం 17 దొంగతనం కేసులు నమోదై ఉన్నట్లు ఎస్పీ శ్రీనివాస రావు తెలిపారు. పరారీలో ఉన్న మిగిలిన ఇద్దరి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
తాజావార్తలు
-
Sumalatha: జానీ మాస్టర్ అంటే ఎందుకు అంత భయం? వల్లభనేని అనిల్‌పై సుమలత ఫైర్!
-
Divya Mittal: దివ్యా మిట్టల్ కోసం కాంగ్రెస్, ఎస్పీ పోటీ? యూపీలో మాజీ IAS సంచలనం..
-
Tollywood Box Office: టాలీవుడ్‌ను ముంచేసిన సెప్టెంబర్.. నాని ‘ది ప్యారడైజ్’ గట్టెక్కుతుందా?
-
US Crime: ప్రెగ్నెంట్ కూతురి హత్య కేసులో సంచలనం.. కాబోయే అల్లుడితో తల్లికి లైంగిక సంబంధం!
-
Krishna: ఇండస్ట్రీని రెండుగా చీల్చాలని చూస్తే ఊరుకోం.. జానీ మాస్టర్ భార్యపై ప్రొడక్షన్ ప్రెసిడెంట్ ఫైర్!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?