NTV Telugu Site icon

Extramarital Affair: భర్త విదేశాల్లో.. ప్రియుడితో భార్య బెడ్రూంలో.. ఆ తర్వాత?

Wife Eloped With Another Bo

Wife Eloped With Another Bo

Married Woman Eloped With Another Guy While Husband In Foreign: కుటుంబ పోషణ కోసం భర్త విదేశాలకు వెళ్తే.. భార్య మాత్రం దారి తప్పింది. పరాయి వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. తన పిల్లల్ని ఒక రూంలో పడుకోబెట్టి, మరో రూంలో ప్రియుడితో రాసలీలలు నడిపింది. ఒకరోజు ఎవ్వరికీ తెలియకుండా.. అతనితో వెళ్లిపోయి, కుటుంబసభ్యులకు ట్విస్ట్ ఇచ్చింది. ఈ ఘటన కన్యాకుమారిలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. మార్తాండం సమీపంలోని మెత్తనం ప్రాంతానికి చెందిన సునీల్‌ (29)కు కొన్ని సంవత్సరాల క్రితం కరుంగల్‌లోని తొలైవావట్టంకు చెందిన మోనీషా (25)తో పెళ్లి అయ్యింది. వీళ్లిద్దరిది ప్రేమ వివాహం. ఈ దంపతులకు ఒక కుమారుడు, ఓ కుమార్తె ఉన్నారు. సునీల్ వృత్తిరీత్యా తాపీమేస్త్రి. చాలీచాలని జీతంతో ఇల్లు గడవడం లేదని.. సునీల్ ఆరు నెలల క్రితం పని కోసం విదేశాలకు వెళ్లాడు.

Rashmika Mandana : ఆ పీరియాడిక్‌ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన రష్మిక…?

ఈ క్రమంలో.. ఇంటికి సమీపంలోనే ఉన్న సునీల్‌ బంధువు అర్జున్‌ (27)కు మోనీషా దగ్గరైంది. అతడు తరచూ ఇంటికి వస్తూ, వెళ్తుండటంతో.. ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. అప్పటి నుంచి వీళ్లిద్దరు గుట్టుచప్పుడు కాకుండా తమ రాసలీలలు కొనసాగించారు. బంధువే కావడంతో.. ఎవరూ వీరిని అనుమానించలేదు. ఓవైపు భర్త విదేశాల్లో కష్టపడి డబ్బులు పంపిస్తుంటే.. మోనీషా మాత్రం అర్జున్‌తో కామక్రీడల్లో మునిగింది. ఇక అర్జున్‌తోనే ఉండాలని నిర్ణయించుకున్న మోనీషా.. ఒకరోజు తన ఇద్దరు పిల్లల్ని తల్లిదండ్రుల ఇంట్లో వదిలిపెట్టింది. బ్యాంక్ పని మీద వెళ్తున్నానని చెప్పి, ఇంటి నుంచి వెళ్లింది. అంతే.. మళ్లీ ఆమె తిరిగిరాలేదు. దీంతో కంగారుపడ్డ మోనీషా తల్లిదండ్రులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. మోనీషా, అర్జున్ మధ్య వివాహేతర సంబంధం ఉందన్న విషయాన్ని తేల్చారు. అలాగే.. వాళ్లిద్దరు కేరళలో ఉన్నట్టు కనుగొన్నారు.

Hyderabad :నార్సింగ్ లో దారుణం.. యువతి పై కత్తితో దాడి చేసిన ప్రియుడు..

దీంతో.. వాళ్లిద్దరు మార్తాండం పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. అక్కడ మోనీషా, తల్లిదండ్రుల మధ్య పంచాయతీ నడిచింది. వివాహేతర సంబంధం మంచిది కాదని, విదేశాల్లో ఉన్న సునీల్‌తో పాటు పిల్లలు అన్యాయమైపోతారని తల్లిదండ్రులు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. కానీ.. మోనీషా మాత్రం తిరిగి ఇంటికి రానని తేల్చి చెప్పింది. తాను అర్జున్‌తోనే ఉంటానని చెప్పి.. అక్కడి నుంచి వెళ్లిపోయింది.

Show comments