Site icon NTV Telugu

Crime News: చెల్లిని “వాడుకుని”, అక్కతో సహజీవనం.. లైంగిక దోపిడి, రూ. 20 లక్షలు కాజేసిన వివాహితుడు..

Crime

Crime

Crime News: లివ్-ఇన్ రిలేషన్లలో అమ్మాయిలు మోసపోతున్న సంఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువయ్యాయి. తాజాగా బెంగళూర్‌లో ఓ వ్యక్తి అక్కాచెల్లెళ్లను లైంగిక దోపిడి చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. 29 ఏళ్ల శుభం శుక్లా అనే వ్యక్తి ఇద్దరు అక్కాచెల్లెళ్లను మోసం చేసిన కేసులో బెంగళూర్ బాగల్‌గుంటే పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ప్రేమ ముసుగులో ఒక మహిళ నుంచి దాదాపుగా రూ. 20 లక్షలు, 200 గ్రాముల బంగారాన్ని కాజేశాడు. అయితే, శుభం శుక్లాకు అప్పటికే పెళ్లయిన విషయాన్ని దాచి పెట్టి ఈ తతంగం నడిపించాడు. ఇతడిపై లైంగిక దోపిడి, దొంగతనం ఆరోపణలు నమోదు చేశారు.

Read Also: Jammu Kashmir: జమ్మూలో 30 మందికిపైగా పాక్ ఉగ్రవాదులు.. భద్రత కట్టుదిట్టం..

నీలమంగళ ప్రాంతంలో ఈ కేసు ప్రారంభమైనట్లు పోలీసులు తెలిపాను. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, శుభం శుక్లా ముందుగా మైనర్ బాలికతో స్నేహం చేసి, ఆమె కుటుంబానికి దగ్గరయ్యాడు. మైనర్ బాలికను లైంగికంగా వాడుకున్నాడు. ఆ తర్వాత, ఆమె అక్కను టార్గెట్ చేసి, లవ్ పేరుతో సహజీవనంలోకి దింపాడు. బాధితురాలిని తన తన తల్లిదండ్రులకు అబద్ధం చెప్పమని ఒప్పంచి, ఉద్యోగం కోసం ముంబై వెళ్తున్నట్లు చెప్పేలా చేశారు. కానీ, ఇద్దరూ కూడా బెంగళూర్‌లో మూడేళ్లు కలిసి ఉన్నారు.

ఈ సమయంలోనే బాధితురాలి నుంచి డబ్బు, నగలను శుభం శుక్లా కాజేశాడు. శుక్లాకు అప్పటికే పెళ్లయిందని తెసుకున్న బాధిత మహిళ నిలదీసింది. దీంతో, ఆమెకు విడాకులు ఇస్తానని చెప్పాడు, కానీ ఆమెను ప్రతీరోజు వేధించడం ప్రారంభించాడు. వేధింపులు భరించలేక, చివరకు అక్కడి నుంచి తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోక్సో చట్టంతో పాటు మోసం, దొంగతనం ఆరోపణ కింద కేసులు నమోదు చేశారు. శుక్లాను అరెస్ట్ చేసి, దర్యాప్తు కొనసాగిస్తున్నందున అతడిని కస్టడీలోకి తీసుకున్నారు.

Exit mobile version