NTV Telugu Site icon

Haryana: దారుణం.. భార్య చేతులు, తల నరికి నిప్పంటించిన వ్యక్తి..

Haryana

Haryana

Man kills wife: హర్యానాలో దారుణం జరిగింది. ఢిల్లీ శ్రద్ధావాకర్ హత్యను తలపించే విధంగా ఓ వ్యక్తి అత్యంత క్రూరంగా ప్రవర్తించాడు. సొంత భార్యను అత్యంత దారుణంగా హత్య చేశాడు. మనేసర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే 34 ఏళ్ల వ్యక్తి తన మొదటి భార్య చేతులు నరికి, ఆపై శరీరం నుంచి తలను వేరు చేసి మృతదేహానికి నిప్పటించాడు. తన భార్యను తానే హత్య చేసినట్లు పోలీసులు ముందు అంగీకరించాడు. ప్రస్తుతం పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.

Read Also: SL vs IRE : 71 ఏళ్ల వరల్డ్ రికార్డ్ బద్దలు కొట్టిన శ్రీలంక బౌలర్

ఏప్రిల్ 21న మనేసర్ లోని ఓ గ్రామంలో సగం కాలిపోయిన మహిళ మృతదేహాన్ని కనుగొన్నారు. డెడ్ బాడీ తల, చేతులు నరికేసి ఉండటంతో ఎక్కడో హత్య చేసి ఇక్కడ పడేసినట్లు పోలీసులు అనుమానించారు. ఏప్రిల్ 23న మహిళకు సంబంధించిన చేతులను గుర్తించడంతో ఈ హత్యకు సంబంధించిన వివరాలు మెల్లిమెల్లిగా బయటకు వచ్చాయి. ఏప్రిల్ 26న మహిళ తలను పోలీసులు గుర్తించారు. మృతురాలని ఖేర్కీ దౌలా ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. చనిపోయిన మహిళ వయస్సు 30 ఏళ్లు ఉంటుందని పోలీసులు అంచానా వేశారు.

హత్యకు పాల్పడిన నిందితుడు జితేందర్ ను పోలీసులు విచారిస్తున్నారు. శుక్రవారం మరిన్ని వివరాలు తెలియజేస్తామని గురుగ్రామ్ పోలీస్ కమిషనర్ కళా రామచంద్రన్ తెలిపారు. జితేందర్ గాంధీ నగర్ నివాసిగా, మనేసర్ ప్రాంతంలో అద్దెకు నివసిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ముందుగా ఈ మహిళ మృతదేహాన్ని ఉమేద్ సింగ్ తన పొలంలో గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ కేసులో మరిన్ని వివరాలు తెలుసుకునేందు పోలీసులు విచారణ చేస్తున్నారు.

Show comments