NTV Telugu Site icon

Suitcase murder: “నా వల్ల కావడం లేదు అందుకే చంపేశా నాన్న”.. రాత్రంతా భార్య డెడ్‌బాడీతో ముచ్చట్లు..

Suitcase Murder

Suitcase Murder

Suitcase murder: బెంగళూర్‌లో భార్యను హత్య చేసి, సూట్‌కేసులో దాచిన సంఘటన సంచలనంగా మారింది. తన భార్య గౌరీ(35)ని హత్య చేసినట్లు భర్త రాకేష్ ఖేడేకర్(36) తన తండ్రి రాజేంద్రకు ఫోన్ కాల్ చేసి చంపినట్లు ఒప్పుకున్నాడు. ఆ తర్వాత ఆత్మహత్యకు ప్రయత్నం చేశాడు. రాజేంద్ర చెబుతున్న వివరాల ప్రకారం.. రాకేష్ తనకు ఫోన్ చేసి, గౌరీతో తరుచూ గొడవలు జరుగుతున్నాయని చెప్పేవాడు, అందువల్లే నేను చంపేశాడని అన్నాడు. ఆమె వేధింపుల గురించి గతంలో తన అత్తగారికి కూడా చెప్పాడు. గౌరీ మామ అయిన రాజేంద్ర ఆమెకు దూకుడు మనస్తత్వం ఉందని, రాకేష్ 86 ఏళ్ల అమ్మమ్మపై దాడి కూడా చేసినట్లు వెల్లడించాడు.

Read Also: Tamil Nadu: స్టాలిన్, విజయ్, అన్నామలై.. సీఎంగా తమిళ ప్రజలు ఎవరిని కోరుకుంటున్నారు..?

ఉద్యోగ రీత్యా మహారాష్ట్ర నుంచి బెంగళూర్‌కి మారిన ఈ జంట తరుచూ గొడవ పడే వారిని ఇరుగుపొరుగు వారు చెబుతున్నారు. గౌరీ రాకేష్‌పై పలు సందర్భాల్లో చేయిజేసుకుందని వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే మార్చి 26న మళ్లీ ఇద్దరి మధ్య గొడవ జరిగింది. గౌరీ మొదట రాకేష్‌పై కత్తితో దాడి చేయడానికి ప్రయత్నించింది. ఆ తర్వాత ప్రతీకారంతో రాకేష్ గౌరీని అనేక సార్లు పొడిచి హత్య చేశాడు, ఆ తర్వాత డెడ్‌బాడీని సూట్‌కేస్‌లో ఉంది. అక్కడి నుంచి మహారాష్ట్రకు పారిపోయాడు.

ఇదిలా ఉంటే, ఈ కేసులో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. సీనియర్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్‌గా రాకేష్ పనిచేస్తున్నాడు, గౌరీకి ఉద్యోగం లేదు. మహారాష్ట్ర నుంచి బెంగళూర్‌కి మకాం మార్చిన తర్వాత నగరంలోని దొడ్డ కమ్మనహళ్లి ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. తరచూ రాకేష్‌తో గొడవపడుతుండటంతో విసిగిపోయి, హత్య చేసినట్లు తెలుస్తోంది. మార్చి 26న హత్య జరిగిన తర్వాత పారిపోవడానికి ముందు రాకేష్ రాత్రంతా గౌరీ మృతదేహం వద్దే కూర్చుని ఆమెతో రాకేష్ మాట్లాడినట్లు తెలిసింది. ఈ ఘటన తర్వాత పూణే పారిపోయి, అక్కడ ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న రాకేష్ పరిస్థితి మెరుగుపడిన తర్వాత పోలీసులు బెంగళూర్ తీసుకురానున్నారు.