Site icon NTV Telugu

Theft: “మంచి దొంగ”.. రామనవమి రోజు దొంగతనం చేసి, క్షమించాలని లేఖ..

Theft

Theft

Theft: మధ్యప్రదేశ్‌లో ఓ వ్యక్తి, దొంగతనం చేసిన క్షమించాలని కోరుతూ లేఖ రాశాడు. ఖార్గోన్‌ జిల్లాలో ఒక దుకాణం నుంచి రూ. 2.45 లక్షలు దొంగలించిన వ్యక్తి, ‘‘రామ నవమి’’ రోజు దొంగతనం చేసినందుకు క్షమించాలని కోరాడు. అప్పులతో ఇబ్బందులు ఉన్నాయని, అప్పులు ఇచ్చిన వారు ఇబ్బందులు పెడుతున్నారని లేఖలో పేర్కొన్నాడు. ఆరు నెలల్లో దొంగిలిచిన మొత్తాన్ని తిరిగి చెల్లిస్తానని హామీ కూడా ఇచ్చాడని సోమవారం పోలీస్ అధికారులు చెప్పారు.

Read Also: Priyanka Jawalkar : ట్యాక్సీవాలా నుంచి మధ్యలోనే తీసేస్తారనుకున్నాః ప్రియాంక జవాల్కర్

ఆదివారం రాత్రి కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని జమీదార్ మొహల్లాలోని జుజర్ అలీ బోహ్రా దుకాణం నుంచి దొంగతనం జరిగినట్లు ఎస్ఐ అర్షద్ ఖాన్ తెలిపారు. దొంగ నీట్‌గా టైప్ చేసిన లేఖను వదిలి వెళ్లినట్లు చెప్పాడు. దుకాణం యజమానిని జుజర్ భాయ్ అని లేఖలో సంబోధంచాడు. దుకాణ యజమాని రూ. 2.84 లక్షల బ్యాగుని షాపులోనే ఉంచాడు. అందులో రూ. 2.45 లక్షలు దొంగిలించి, మిగతా రూ. 30,000 అందులోనే ఉండాడు. రామనవమి రోజు ఈ పని చేసినందుకు లేఖలో క్షమాపణలు కోరాడు.

ఇదే కాకుండా, తాను మీ పరిసరాల్లో ఉంటున్నానని, తనకు చాలా అప్పులు ఉన్నాయని, దొంగతనం చేయవద్దని అనుకున్నాను కానీ, వేరే మార్గం లేక ఇలా చేసినట్లు లేఖలో రాశాడు. తనకు అవసరమయ్యే డబ్బును మాత్రమే దొంగిలించి, మిగతావి బ్యాగులో పెట్టినట్లు చెప్పాడు. ఆరు నెలల్లో దొంగిలించిన మొత్తాన్ని చెల్లిస్తానని హామీ ఇచ్చాడు. ఇదే విధంగా దుకాణం యజమానిని తనను పోలీసులకు అప్పగించే స్వేచ్ఛ ఉందని లేఖలో చెప్పినట్లు ఎస్ఐ తెలిపారు.

Exit mobile version