భార్యాభర్తల సంబంధం రోజురోజుకు దిగజారిపోతుంది. కలకాలం కలిసుండాల్సిన దంపతులు.. మధ్యలో పెడదారిన పడుతున్నారు. దీంతో కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోతుంది. క్షణిక సుఖం కొందరు అడ్డదారులు తొక్కి.. మధ్యలోనే జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తాజాగా ఓ వివాహిత.. యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఏకాంతంగా ఉన్న సమయంలో భర్త కంట్లో పడ్డారు. దీంతో కోపోద్రేకుడైన భర్త ఘాతుకానికి పాల్పడ్డాడు. ఈ దారుణం దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: Ram Charan: అమెరికాలో రామ్ చరణ్ అయ్యప్ప దీక్ష విరమణ
ఢిల్లీలోని శాస్త్రి పార్క్ ప్రాంతంలో ఓ వివాహిత కుటుంబం నివాసం ఉంటుంది. ఆమె.. 21 ఏళ్ల యువకుడైన రితిక్ వర్మతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అయితే సోమవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో వివాహిత.. యువకుడితో ఏకాంతంగా ఉంది. అదే సమయంలో భర్త ఇంటికొచ్చాడు. దీంతో ఇద్దరిని రెడ్‌హ్యాండెడ్ పట్టుకున్నాడు. ఈ పరిణామంతో భర్త కోపంతో రగిలిపోయాడు. మరికొందరి సాయంతో యువకుడిని తీవ్ర చిత్రహింసలకు గురిచేశాడు. అతడి గోళ్లు కూడా పీకేశారు. రితిక్ వర్మతో పాటు వివాహితను కూడా దారుణంగా కొట్టారు. అయితే తీవ్రగాయాలు కావడంతో రితిక్ వర్మ ప్రాణాలు కోల్పోయాడు.
ఇది కూడా చదవండి: TG Assembly: విపక్షాల నిరసనల మధ్యే మూడు కీలక బిల్లులకు ఆమోదం
రితిక్ వర్మను వివాహిత భర్త దారుణంగా కొట్టడంతోనే చనిపోయినట్లుగా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఈశాన్య) రాకేష్ పవేరియా తెలిపారు. బాధితురాలి మేనమామ మాట్లాడుతూ.. భార్యను, ప్రేమికుడిని ఇంట్లో బంధించి దారుణంగా హింసించారని.. గోళ్లు పీకేశారని తెలిపాడు. రితిక్ వర్మ శరీరమంతా గాయాలే ఉన్నాయని.. ఇష్టమొచ్చినట్లుగా కొట్టడం వల్లే చనిపోయాడని తెలిపాడు. రితిక్‌తో పాటు మహిళను కూడా కొట్టారని.. కాకపోతే రితిక్ వర్మను ఎక్కువ మంది కొట్టడం వల్ల ప్రాణాలు కోల్పోయాడని స్థానికులు చెప్పారు. రితిక్ టెంపో నడుపుతాడని.. తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకు అని తెలిపారు. బంధువులు సంఘటనాస్థలికి చేరుకుని.. రితిక్ వర్మను ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకుండా పోయింది. బాధితుడు చికిత్స పొందుతూ సోమవారం రాత్రి 9 గంటల సమయంలో మృతి చెందాడని, తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
ఇది కూడా చదవండి: Minister Atchannaidu: ఆ పోస్టులను వెంటనే భర్తీ చేయండి.. మంత్రి ఆదేశాలు..