NTV Telugu Site icon

Man Shoots Daughter: పెళ్లికి 4 రోజుల ముందు కూతురిని కాల్చి చంపిన తండ్రి.. కారణం ఏంటంటే..

Madhya Pradesh

Madhya Pradesh

Man Shoots Daughter: పోలీసుల ముందే కూతురిని కాల్చి చంపిన ఘటన మధ్యప్రదేశ్ గ్వాలియర్‌లో జరిగింది. సదరు యువతి పెళ్లికి నాలుగు రోజుల ముందు తండ్రి చేతిలో హతమైంది. ఆమె హత్యకు కొన్ని గంటల ముందే పంచాయతీ కూడా జరిగింది. తండ్రి నిర్ణయించిన పెళ్లిని కాదని, కూతురు వేరే వ్యక్తిని విహాహం చేసుకోవాలని నిర్ణయించుకోవడంతోనే ఈ హత్య జరిగింది. 20 ఏళ్ల యువతి తను గుర్జార్, తన కుటుంబం కుదిర్చిన పెళ్లిని వ్యతిరేకించింది. తనకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటానని చెప్పింది.

మంగళవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో నగరంలోని గోలా కా మందిర్ ప్రాంతంలో ఈ హత్య జరిగింది. హత్యకు పాల్పడిన యువతి తండ్రిని మహేష్ గుర్జార్‌గా గుర్తించారు. అదే రోజు తనూ గుర్జార్ తన పెళ్లి గురించి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. ఈ వీడియోపై ఆగ్రహించిన తండ్రి, దేశీయంగా తయారు చేసిన తుపాకీతో ఆమెను కాల్చి చంపాడు. ఈ హత్యకు తను కజిన్ రాహుల్ కూడా సహకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

Read Also: Tummala Nageswara Rao: ఎంపీ అరవింద్ వ్యాఖ్యలపై మంత్రి తుమ్మల సీరియస్..

ఆమె హత్యకు కొన్ని గంటల ముందు, తన కుటుంబ సభ్యులు తన ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేయాలని చూస్తున్నారని ఆరోపిస్తూ.. 52 సెకన్ల వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. కుటుంబ సభ్యుల నుంచి తన ప్రాణానికి ప్రమాదం ఉందని పేర్కొంది. ‘‘నేను విక్కీని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మా కుటుంబం మొదట్లో అంగీకరించింది, ఆ తర్వాత నిరాకరించింది. వాళ్లు నన్ను రోజూ కొడుతూ, చంపేస్తామని బెదిరిస్తున్నారు. నాకు ఏదైనా జరిగితే, నా కుటుంబమే బాధ్యత వహిస్తుంది’’ అని పేర్కొంది.

విక్కీ అనే వ్యక్తి ఉత్తర్ ప్రదేశ్ ఆగ్రా నివాసితో, తనూ గుర్జార్‌ 6 ఏళ్లుగా రిలేషన్‌లో ఉన్నాడు. ఈ వీడియో వైరల్ కావడంతో ఎస్పీ ధర్మవీర్ సింగ్ నేతృత్వంలోని పోలీస్ అధికారులు ఇరు వర్గాల మధ్య మధ్యవర్తిత్వం వహించేందుకు వారి ఇంటికి చేరుకున్నారు. విషయాన్ని పరిష్కరించడానికి కుల పంచాయతీ కూడా జరిగింది. ఈ సందర్భంలోనే తను గుర్జార్ ఇంట్లో ఉండేందుకు నిరాకరించి, ప్రభుత్వం నిర్వహించే వన్ స్టాప్ సెంటర్‌కి తీసుకెళ్లాలని అభ్యర్థించింది.

ఆ సమయంలోనే మహేష్ కూతురితో పర్సనల్‌గా మాట్లాడాలని కోరాడు. ఆమెను ఒప్పిస్తానని చెప్పాడు. ఇలా నమ్మించిన మహేష్ కూతురుని దేశవాళీ తుపాకీతో కాల్చి చంపాడు. అత్యంత దగ్గర నుంచి ఛాతీ, నుదిలిపై కాల్చడంతో అక్కడిక్కడే తనూ మరణించింది. మహేష్ బంధువులు, పోలీసులపై కూడా తుపాకీతో ఫైర్ చేస్తానని బెదిరించాడు. మహేష్‌ని పోలీసులు అదుపులోకి తీసుకోగా, హత్యకు సహకరించిన రాహుల్ పరారయ్యాడు. జనవరి 18న జరగాల్సిన తను వివాహానికి సన్నాహాలు జరుగుతుండగా ఈ హత్య జరిగింది.

Show comments