Site icon NTV Telugu

కొడుకు కోసం ఇంటికి వెళ్లిన బాలిక.. లోపలికి పిలిచి రేప్ చేసిన తండ్రి

కర్ణాటకలో దారుణం చోటుచేసుకుంది. వావివరుసలు లేని ఒక మృగాడు.. మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అందులోను ఆమె కొడుకు ప్రియురాలని తెలిసినా నీచానికి ఒడిగట్టాడు. ప్రియుడి కోసం ఇంటికి వచ్చిన ఆమె జీవితాన్ని నాశనం చేశాడు. ఈ దారుణ ఘటన ప్రస్తుతం స్థానికంగా సంచలనంగా మారింది.

వివరాలలోకి వెళితే.. బాలే హెన్నూరు పరిధిలో నివాసముంటున్న ఒక బాలిక అదే గ్రామానికి చెందిన యువకుడు గతకొద్దికాలంగా ప్రేమించుకుంటున్నారు. బాలిక ఇంటికి యువకుడు వెళ్లివస్తూ ఉంటాడు.. ఈ నేపథ్యంలోనే బాలిక ఇటీవల తన ప్రియుడిని కలవడానికి అతడి ఇంటికి వెళ్ళింది. అక్కడ ప్రియుడి తండ్రి ఇంట్లో ఒక్కడే ఉన్నాడు. తన కొడుకు లేడని, కొద్దిసేపట్లో వస్తాడని బాలికకు మాయమాటలు చెప్పి లోపలి తీసుకెళ్లాడు. ఎంతసేపటికి ప్రియుడు రాకపోవడంతో బాలిక ఇంటికి బయల్దేరుతుండగా.. తలుపులు మూసిన ప్రియుడి తండ్రి బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బెదిరించి ఆమెను లొంగదీసుకున్నాడు. అనంతరం బాలిక ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పగా వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Exit mobile version