NTV Telugu Site icon

Gujarat: అత్తమామల్ని లేపేసేందుకు ఏకంగా బాంబు తయారీ నేర్చుకున్నాడు..

Bombs

Bombs

Gujarat: అహ్మదాబాద్‌లోని ఓ ఇంట్లో డెలివరీ చేసిన పార్సిల్ పేలిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. ఈ ఘటనలో నిందితులైన ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. ఈ కేసులో కుట్ర కోణం వెలుగులోకి వచ్చింది. తన నుంచి భార్యని విడదీసేందుకు కారణమైన ఆమె ఫ్రెండ్ బల్దేవ్ సుఖాడియా, ఆమె తండ్రి, సోదరుడిపై ప్రతీకారం తీర్చుకునేందుకు నిందితుడు రూపన్ రావు(44) ఇంటర్నెట్‌లో బాంబులు, నాటు తుపాకులను తయారుచేయడం నేర్చుకున్నట్లు తేలింది.

నిందితుల నుంచి మరో రెండు బాంబులు, కంట్రీమేడ్ పిస్టర్, క్యాట్రిడ్జ్‌లు, ఆయుధాల తయారీలో ఉపయోగించే సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రూపన్ రావు భార్య విడాకులు తీసుకుంటోంది. ఈ కేసు విచారణ ప్రస్తుతం కోర్టులో ఉంది. సుఖాడియా తనకు, తన భార్యకు మధ్య విభేదాలు సృష్టించి తనకు, తన పిల్లలకు దూరం చేసిందని రూపర్ రావు నమ్మాడు. తన భార్య, అత్తమామలు, బావమరిది కడుపునొప్పి కారణంగా తాను బలహీనపరిచారని నిందితుడు భావించినట్లు అధికారులు తెలిపారు.

Read Also: Zia Ur Rehman Barq: విద్యుత్ దొంగతనం.. సమాజ్‌వాదీ ఎంపీకి చుక్కలు చూపిస్తున్న యోగి సర్కార్..

నిందితుడు సుఖాదియా, అతని అత్తమామలను చంపడానికి, తన భార్యను ఆమె కుటుంబ నుంచి వేరు చేయడానికి, ఆమెను ఒంటరి చేయడానికి మూడు నాలుగు నెలల్లో ఇంటర్నెల్‌లో చూసి బాంబులు, ఆయుధాల తయారీని నేర్చుకోవడం ప్రారంభించినట్లు విచారణ తేలింది. రూపన్ రావుతో పాటు సహ నిందితులు సల్ఫర్ పౌడర్, బ్లేడ్లు, బ్యాటరీలు, బొగ్గు, బాణాసంచా నుంచి గన్‌పౌడర్ వంటి పదార్థాలను ఉపయోగించి రిమోట్ కంట్రోల్డ్ బాంబులను తయారు చేసిన కుట్ర పన్నారు.

రూపన్ రావుకి రోహన్ రావల్(21), గౌరవ్ గాధవి సహకరించాడు. శుక్రవారం రాత్రి సుఖాడియా ఇంటికి రావల్ మొదట బాంబు ఉన్న పార్సిల్‌ని తీసుకెళ్లాడు. అయితే, వారి టార్గెట్ ఇంట్లో లేకపోవడంతో పార్సిల్ ఇవ్వకుండానే వెనుదిరిగారు. ఆ తర్వాత ఇద్దరూ మరుసటి రోజు పార్సిట్ డెలివరీ చేయడానికి గాధమిని పంపించారు. రావల్‌ వెనక నుంచి రిమోట్ కంట్రోల్ ఉపయోగించి బాంబును పేల్చారు. రూపన్ రావు తన అత్తమామల్ని, బావమరిదిని కూడా ఇదే విధంగా హత్య చేయాలని ప్లాన్ చేసినట్లు డీసీసీ వెల్లడించారు.

పేలుడు ఘటన తర్వాత గాధవిని స్పాట్‌లోనే పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను వెంబడిస్తున్నప్పుడు, పోలీసులు ఒక కారు నుంచి రెండు లైవ్ బాంబుల్ని కనుగొన్నారు. వాటిని తర్వాత నిర్వీర్యం చేశారు. అదే కారులో కంట్రీ మేడ్ పిస్టల్ కూడా స్వాధీనం చేసుకున్నారు. పేలుడు పదార్థాలు, అక్రమ ఆయుధాల సెక్షన్ల కింద నిందితులపై కేసులు నమోదు చేశారు.

Show comments