Instagram Reels: ఉత్తర్ ప్రదేశ్ మీరట్‌లో దారుణం జరిగింది. ఒక వ్యక్తి తన ముగ్గురు కూతుళ్ల ముందే భార్య గొంతు కోసి హత్య చేశాడు. ఇన్‌స్టాగ్రామ్‌కి బానిస కావడం వల్లే భర్త హత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఇన్‌స్టాగ్రామ్స్ రీల్స్ చేయడం, దానికి కామెంట్స్ రావడం, గుర్తుతెలియని వ్యక్తుల నుంచి కాల్స్ రావడంతోనే సదరు వ్యక్తి, తన భార్యని చంపేశాడు.
Read Also: Maharashtra: శరద్ పవార్ పార్టీకి షాక్! మహాయుతి వైపు చూస్తున్న ఎంపీలు!
ఈ సంఘటన మంగళవారం కంకేర్‌ఖేరా పోలీస్ స్టేషన్ పరిధిలోని శోభాపూర్ అవుట్‌పోస్ట్ ప్రాంతంలో లఖ్వాయా గ్రామంలో జరిగింది. సీమకు రాజుతో 11 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ముగ్గురు కుమార్తెలు వంశిక (10), అన్షిక (6), ప్రియాంషి (3) ఉన్నారు. నివేదిక ప్రకారం.. 24 గంటల్లో సీమా ఇన్‌స్టాగ్రామ్‌లో 13 రీల్స్ పోస్ట్ చేసింది. రీల్స్‌కి కామెంట్స్, లైక్స్ వచ్చాయి. గుర్తు తెలియని వ్యక్తి నుంచి తన తల్లికి కాల్ వచ్చిందని, ఇది తన తండ్రికి కోపం తెప్పించిందని పెద్ద కుమార్తె వంశిక వెల్లడించింది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చెలరేగినట్లు చెప్పింది. ఆ తర్వాత సీమను రాజు కత్తితో పొడిచి చంపినట్లు చెప్పింది.
ముగ్గురు పిల్లలు కూడా భయంతో దుప్పటి కింద నుంచి జరుగుతున్న నేరాన్ని చూశారు. గుర్తు తెలియని నంబర్ నుంచి కాల్ రావడంతో తన తండ్రి, తల్లితో వాగ్వాదానికి దిగినట్లు వారు తెలిపారు. రాజు సీమను ఇటుకతో కొట్టి, గొంతు కోసి చంపి, సీమ మొబైల్ ఫోన్లను తీసుకుని పరారయ్యాడు. మృతదేహాన్ని పోస్టుమార్టంకి తరలించిన పోలీసులు, సీమకు ఎవరి నుంచి కాల్స్ వచ్చాయి..? అనేది విచారించడంతో పాటు నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు ప్రారంభించారు.