NTV Telugu Site icon

Alcohol: మద్యం తాగొద్దని సలహా ఇవ్వడమే నేరమైంది.. వ్యక్తి దారుణహత్య..

Bengaluru Incident

Bengaluru Incident

Alcohol: మద్యం తాగొద్దని మంచి సలహా ఇవ్వడమే పాపమైంది. ఇది నచ్చని ఇద్దరు యువకులు 45 ఏళ్ల వ్యక్తిని కిరాతకంగా కత్తితో పొడిచి చంపేశారు. ఈ ఘటన బెంగళూర్‌లో జరిగింది. నగరంలోని రామచంద్రపురలో జరిగిన ఈ హత్యలో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Read Also: Misa Bharti: అధికారంలోకి వస్తే ప్రధాని మోదీ జైలుకే.. “మిసా” పేరు ఎందుకు పెట్టారని బీజేపీ కౌంటర్

వివరాల్లోకి వెళ్తే.. చనిపోయిన వ్యక్తిని వెంకటేష్‌గా గుర్తించారు. ఇతను రామచంద్రపుర నివాసి. అదే ప్రాంతానికి చెందిన పవన్(24), నందా(21) ఇద్దరు రాత్రి 10.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. వెంకటేష్ సాయంత్రం రామచంద్రపుర ప్లేగ్రౌండ్ వైపు నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో వాటర్ ట్యాంక్ దగ్గర పవన్, నందాలు మద్యం సేవించడాన్ని గమనించాడు. దీంతో వెంకటేష్ మద్యం సేవించొద్దని ఇద్దరు యువకులకు సూచించారు.

మృతుడు వెంకటేష్, పవన్ ఇద్దరు ఇరుగుపొరుగు వారు. మంచి ఉద్దేశంతో సలహా ఇవ్వడం ఘర్షణకు దారి తీసింది. వెంకటేష్ ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో ఆగ్రహానికి గురైన పవన్ తన ఇంటి నుంచి కత్తిని తీసుకువచ్చి వెంకటేష్‌ని దారుణంగా పొడిచాడు. తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికులు ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతు మరణించారు. పోలీసులు పవన్, నందాలను అరెస్ట్ చేసి, హత్య సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.