Marriage Fraud: పెళ్లి పేరుతో ఒంటరి మహిళను ట్రాప్ చేసి రూ. 28 కోట్ల మోసం..
- నాగమణికి 1992లో ఒక వ్యక్తితో వివాహం
- రోడ్డు ప్రమాదంలో కొడుకు మృతి
- అదే దిగులుతో చనిపోయిన నాగమణి భర్త
- నాగమణికి వచ్చిన కొడుకు బీమా డబ్బులు, భర్త ఆస్తులు
- మళ్లీ పెళ్లి చేసుకోవాలని భావించిన నాగమణి
- శేషాపురానికి చెందిన శివప్రసాద్ నాయుడు పరిచయం
- భార్య చనిపోయిందని, పిల్లలు లేరని శివప్రసాద్ నాయుడు
- భార్య డెత్ సర్టిఫికెట్లు కూడా చూపించాడు
- 2022లో శివప్రసాద్ నాయుడు, నాగమణి పెళ్లి
- రూ.1,700 కోట్ల లాటరీ వచ్చిందన్న శివప్రసాద్
- పన్నుల రూపంలో రూ.15 కోట్లు చెల్లించాలని బుకాయింపు
- రూ.3 కోట్లు శివప్రసాద్, అతని అన్న చక్రవర్తి
- వదిన హేమలత బ్యాంకు ఖాతాలకు బదిలీ
- మొత్తం రూ.28 కోట్లు తీసుకున్న శివప్రసాద్
- బంగారుపాళ్యానికి వెళ్లిన నాగమణికి షాక్
- శివ ప్రసాద్‌కు భార్యతోపాటు 8 ఏళ్ల కూతురు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒంటరిగా ఉన్న ఓ మహిళను నమ్మకంగా పెళ్లి చేసుకున్న ఓ ప్రబుద్ధుడు లాటరీ పేరుతో ఆమెకు టోకరా వేశాడు. రూ.15 కోట్లు పన్నులు చెల్లిస్తే రూ.1,700 కోట్లు వస్తాయని ఆశలు కల్పించాడు. చివరికి ఆమె ఆస్తులు అమ్మించి రూ.28 కోట్లు తీసుకుని పరారయ్యాడు. బాధితురాలు చిత్తూరు జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. ఇక్కడ.. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు శివ ప్రసాద్ నాయుడు. వీడు మామూలోడు కాదు. బెంగళూరుకు చెందిన ఓ మహిళను పెళ్లి పేరుతో చీటింగ్ చేశాడు.. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలోని రాజుపేటకి చెందిన నాగమణికి 1992లో ఒక వ్యక్తితో వివాహమైంది. ఒక కొడుకు కూడా పుట్టాడు. కొన్నేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో కొడుకు చనిపోయాడు. అదే దిగులుతో భర్త కూడా మరణించాడు. కొడుకు బీమా డబ్బులు, భర్త ఆస్తులన్నీ నాగమణికి వారసత్వంగా వచ్చాయి..
READ MORE: Shine Tom Chacko: బహిరంగంగా క్షమాపణలు చెప్పిన ‘దసరా’ విలన్.. వివాదానికి ముగింపు!
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
- Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
- Blood Donation Camp: రక్తదాన శిబిరంలో 'కులం' కలకలం.. తమిళనాడులో వివాదం
ఒక్కగానొక్క కొడుకు, భర్త మృతి చెందడంతో ఎంత ఆస్తి ఉండి ఏం లాభం అనుకుంది. మళ్లీ పెళ్లి చేసుకోవాలని భావించింది. ఇందుకోసం చిత్తూరులోని ఓ పెళ్లిళ్ల మధ్యవర్తిని సంప్రదించింది. ఈ క్రమంలో బంగారుపాళ్యం మండలం శేషాపురానికి చెందిన శివప్రసాద్ నాయుడు ఆమెకు పరిచయం అయ్యాడు. తన భార్య చనిపోయిందని, పిల్లలు కూడా లేరని చెప్పాడు. పైగా భార్య డెత్ సర్టిఫికెట్లు కూడా చూపించాడు. దీంతో నాగమణి అతన్ని నమ్మింది. ఆ తర్వాత పెళ్లికి అంగీకరించింది. కుటుంబ సభ్యుల సమక్షంలో శివప్రసాద్ నాయుడిని 2022 అక్టోబర్‌లో కర్ణాటకలోని బంగారు తిరుపతి ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. అక్కడే ఇద్దరు కాపురం పెట్టారు..
READ MORE: Hyderabad: పెళ్లై రెండు నెలలైనా కాలేదు..! భర్త ఆత్మహత్య.. హుస్సేన్ సాగర్‌లో దూకిన భార్య
కొన్ని రోజుల తర్వాత శివ ప్రసాద్ నాయుడు అసలు కథ మొదలు పెట్టాడు. తనకు ఆర్బీఐ నుంచి రూ.1,700 కోట్ల లాటరీ తగిలిందని నాగమణికి ఓ పత్రాన్ని చూపించాడు. ఈ మొత్తం రావాలంటే పన్నుల రూపంలో రూ.15 కోట్లు చెల్లించాలని నమ్మించాడు. దీంతో ఆమె తన బ్యాంకు ఖాతాలో ఉన్న దాదాపు రూ.3 కోట్ల నగదును శివప్రసాద్, అతని అన్న చక్రవర్తి, వదిన హేమలత బ్యాంకు ఖాతాలకు బదిలీ చేసింది. రూ.15 కోట్ల విలువ చేసే భూములు, రూ.10 కోట్ల విలువ చేసే భవనాన్ని విక్రయించి మొత్తం రూ.28 కోట్లు తీసుకున్నాడు శివప్రసాద్. ఇంత వరకు బాగానే ఉంది. అలా రోజులు గడుస్తున్నాయి. కానీ RBI నుంచి రావాల్సిన డబ్బు రావడం లేదని నాగమణి ప్రశ్నించింది. కానీ మాయమాటలు చెప్పి తప్పించుకున్నాడు. ఓసారి గట్టిగా నిలదీయడంతో చంపేస్తానని బెదిరించాడు. అంతే కాదు గతేడాది డిసెంబరులో ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అతడ్ని వెతుక్కుంటూ బంగారుపాళ్యానికి వెళ్లిన నాగమణికి ఊహించని షాక్ తగిలింది. శివప్రసాద్ నాయుడికి భార్యతోపాటు 8 ఏళ్ల కూతురు ఉన్నారని తెలిసి విస్తుపోయింది. దీనిపై గట్టిగా నిలదీయడంతో అందరూ కలిసి ఆమెపై దాడిచేసి, చంపేస్తామంటూ బెదిరించారు. దీంతో బాధితురాలు తనకు న్యాయం చేయాలని ఎస్పీకి ఫిర్యాదు చేశారు… పోలీసులు ఈ కేసుపై సీరియస్‌గా దర్యాప్తు చేస్తున్నారు. నాగమణిని మోసం చేసిన శివప్రసాద్ నాయుడును విచారిస్తున్నారు..
తాజావార్తలు
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!