NTV Telugu Site icon

Relationship: క్లాస్‌మేట్‌తో 14 ఏళ్ల బాలిక రిలేషన్‌షిప్.. తండ్రి ఏం చేశాడంటే..?

Kerala Crime

Kerala Crime

Relationship: చిన్న వయసులో సంబంధాలు పెట్టుకోవడం, తల్లిదండ్రుల మాట వినకపోవడంతో సమస్యలు ఏర్పడుతున్నాయి. ఇదిలా ఉంటే కొందరు తల్లిదండ్రులు వేరే కులానికి చెందిన వ్యక్తులను ప్రేమించారని కన్న కూతుళ్లను చంపడం కూడా చూస్తున్నాం. ఇటీవల కాలంలో కర్ణాటకతో పాటు పలు రాష్ట్రాలో ఇలా పరువు హత్యలు చోటు చేసుకున్నాయి. కొన్ని సందర్భాల్లో తెలిసీ తెలియని వయసులో వేరే వ్యక్తిని ప్రేమించడం, వారితో సంబంధం కలిగి ఉండటం కూడా కూతుళ్ల హత్యలకు దారి తీస్తున్నాయి.

Read Also: Mahua Moitra: “వ్యక్తిగత సంబంధమే” ఈ వివాదానికి కారణం.. ఎథిక్స్ కమిటీ ముందు మహువా మోయిత్రా..?

తాజాగా కేరళకు చెందిన ఓ వ్యక్తి తన 14 ఏళ్ల కుమార్తెను చంపేందుకు ప్రయత్నించాడు. తన క్లాస్‌మేట్‌తో సంబంధాన్ని కొనసాగించినందుకు తండ్రి దారుణంగా కొట్టాడు. ఇనుపరాడ్ తో దాడి చేయడమే కాకుండా.. పురుగుల మందు తాగించేందుకు ప్రయత్నించాడు. ప్రస్తుతం సదరు వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. బాలికను ఆస్పత్రిలో చేర్చారు, ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బాలిక పరిస్థితిని గమనించిన ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు వివరాలు చెప్పడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

తన క్లాస్‌మేట్‌తో రిలేషన్‌లో ఉన్న కూతురిని, విరమించుకోవాలని తండ్రి హెచ్చరించాడు. అయినప్పటికీ.. అమ్మాయి స్నేహితుడితో సంబంధాన్ని కొనసాగించడం తండ్రికి కోపం తెప్పించింది. కోపంలో ఆమెపై ఇనుపరాడ్ తో దాడి చేయడమే కాకుండా, పురుగుల మందు తాగించే ప్రయత్నం చేశాడు. ప్రస్తుతం నిందితుడిని అదుపులోకి తీసుకుని హత్యాయత్నం కేసును నమోదు చేశారు.