Site icon NTV Telugu

Rape Case: నేను శృంగారంలో పాల్గొనలేకపోతున్నా.. న్యాయం చేయండి.. ప్రభుత్వంపై యువకుడు ఫైర్

Mp

Mp

Justice Want: తప్పు ఎవరు చేసినా శిక్ష పడాలి అని చెప్పేది చట్టం. అదే చట్టం వందమంది దోషులు తప్పించుకున్నా పర్లేదు.. ఒక నిర్దోషికి మాత్రం శిక్షపడకూడదు అని కూడా చెప్పింది. కానీ, సమాజంలో చాలామంది నిర్దోషులు జైల్లో మగ్గిపోతున్నారు. వాదించే శక్తి లేక కొందరు.. పోలీసుల బలవంతంతో కొందరు కుటుంబాలను వదిలి జైల్లోనే జీవితాలను గడిపేస్తున్నారు. వీరి దుస్థితి గురించి చెప్పుకోలేకపోతున్నారు. అప్పుడెప్పుడో ఏదో దేశంలో చేయని తప్పుకు 30 ఏళ్లకు జైలుకు వెళ్లిన ఒక వ్యక్తి 60 ఏళ్లకు బయటికి వచ్చి తన జీవితం ఇలా అవడానికి కారణమైన ప్రభత్వాన్ని ప్రశ్నించాడు. తనకు నష్టపరిహారం కావాలని, తన జీవితాన్ని మళ్లీ అనుభవించడానికి డబ్బు కావాలని కోరుతూ దావా వేశాడు. కోర్టు సైతం అతడికి న్యాయం చేసింది. తాజాగా ఇలాంటి కేసే మధ్యప్రదేశ్ లో వెలుగు చూసింది. చేయని తప్పుకు ఐదేళ్లు శిక్ష అనుభవించిన ఒక వ్యక్తి బయటికి వచ్చి ప్రభుత్వంపై దావా వేశాడు. తనకు 10 వేల కోట్లు కావాలని ఓ గిరిజన యువకుడు ప్రభుత్వంపై దావా వేశాడు.

Read AlsO; Prisoner Escape: టాయిలెట్ అర్జెంట్.. ఓకే వెళ్లు.. ఇంకేముంది సినిమా స్టైల్లో ట్రైన్ నుంచి జంప్

వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని రత్లామ్‌ ప్రాంతంలో కాంతిలాల్ భిల్ అలియాస్ కాంతు కుటుంబంతో నివసిస్తున్నాడు. 2017 లో అతడు ఒక గ్యాంగ్ రేప్ కేసులో ఇరుక్కున్నాడు. అతను ఆ నేరం చేయకపోయినా పోలీసులు అతడిని నేరస్తుడిగా పరిగణించి అరెస్ట్ చేయడానికి రాగా.. వారి నుంచి తప్పించుకు తిరుగుతూ మూడేళ్లు కుటుంబానికి దూరంగా బతికాడు.. ఇక రెండేళ్ల క్రితం ఒక చిన్న గ్రామంలో కాంతు ను పోలీసులు పట్టుకొని జైలుకు తరలించారు. తాను తప్పు చేయలేదని ఎంత చెప్పినా పోలీసులు వినకుండా అతడికి రెండేళ్లు కఠిన కారాగార శిక్షను అమలుపరిచారు. ఇక చివరికి గతేడాది అక్టోబర్ లో అతడిపై తప్పుడు ఆరోపణలు అని ఋజువు అవ్వడంతో కోర్టు అతడిని రిలీజ్ చేసింది. దాదాపు ఐదేళ్లు అతడు నరకం చూసాడు. కుటుంబాన్ని వదిలి, తిండి, తిప్పలు మాని, ముఖ్యంగా శృంగార కోరికలను చంపుకొని తిరిగాడు. దీని అంతటికి కారణమైన ప్రభుత్వాన్ని అతడు ప్రశ్నించాడు. తన జీవితాన్ని నాశనం చేసినందుకు ప్రభత్వం నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా అతడు కోర్టులో దావా వేశాడు.

“ఐదేళ్లు నేను నరకం చూశాను.. ఇప్పుడు నా వయస్సు 35 దాటింది. శృంగారాన్ని ఆస్వాదించలేకపోతున్నాను. శృంగారం చేయాలనీ ఉన్నా ఆ కోరికలు కూడా రావడం లేదు. నా కుటుంబం రోడ్డున పడింది. నా భార్య, పిల్లలు దిక్కులేనివారు అయ్యారు. కనీసం వారికి వేసుకోవడానికి బట్టలు కూడా లేవని తెల్సింది. తప్పు నాది కాకపోయినా నన్ను జైల్లో హింసించారు. ఇప్పుడు నా జీవితం నాకు కావాలి. నా భార్యాబిడ్డలతో నేను సంతోషంగా ఉండాలనుకుంటున్నాను. పోలీసులు నన్ను తప్పుడు నేరానికి బలిచేశారు. నేను అనుభవించిన నరక యాతనకు నష్ట పరిహారంగా 10 వేల కోట్లు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు. కాంతు తరుపున న్యాయవాది విజయ్ సింగ్ యాదవ్ మాట్లాడుతూ.. మనిషి ప్రాణానికి ఎలాంటి విలువను నిర్ణయించలేమన్నారు. కంటూ జీవితాన్ని పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వం నాశనం చేసింది.. అతను అడిగిన దాంట్లో తప్పులేదు అని చెప్పుకొచ్చాడు. మరి ఈ కేసులో కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాలి.

Read Also:Cm Jaganmohan Reddy: విద్యాశాఖపై జగన్ సమీక్ష.. నాణ్యత విషయంలో రాజీ వద్దు

Exit mobile version