Maharashtra Teacher Arrested For Showing Class 5 Students Obscene Videos: అతడో ఉపాధ్యాయుడు. పాఠశాలలకు వచ్చే విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన బాధ్యత అతనిది. విద్యార్థులను.. ముఖ్యంగా విద్యార్థినులను తన పిల్లలుగా ట్రీట్ చేస్తూ, సత్ప్రవర్తన నేర్పించాలి. కానీ.. అతడు వారి పట్ల వంకరబుద్ధి చూపించాడు. కామంతో కళ్లు మూసుకుపోయిన ఆ టీచర్.. విద్యార్థినులకు బూతు వీడియోలు చూపించాడు. అంతేకాకుండా.. వారిని అసభ్యకరమైన రీతిలో తాకాడు. అతని ప్రవర్తనతో భయబ్రాంతులకు గురైన అమ్మాయిలు.. తమ పేరెంట్స్‌కి చెప్పడంతో, వ్యవహారం పోలీస్ స్టేషన్ దాకా వెళ్లింది. అతడు కటకటాలపాలయ్యాడు. ఇది ఘటన మహారాష్ట్రలోని గోండియా జిల్లాలో చోటు చేసుకుంది.
Amit Shah: ఇండియన్ సినిమాకు ఇదో చారిత్రాత్మక రోజు.. ఆర్ఆర్ఆర్ టీమ్‌కి అమిత్ షా శుభాకాంక్షలు
ఆ వివరాల్లోకి వెళ్తే.. గోండియాలోని ఓ ప్రైమరీ స్కూల్‌లో 52 ఏళ్ల వ్యక్తి ఉపాధ్యాయుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. అసిస్టెంట్ టీచర్‌గా కొనసాగుతున్న అతడు.. 5వ తరగతికి చెందిన ఎనిమిది విద్యార్థినులకు బూతు వీడియోలు చూపించాడు. అంతేకాదు.. వారి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. ప్రైవేట్ పార్ట్స్‌ని తాకుతూ.. వేధింపులకు గురి చేశాడు. తండ్రిలా నడుచుకోవాల్సిన ఉపాధ్యాయుడు తమ పట్ల ఇలా ప్రవర్తించడం చూసి ఖంగుతిన్న ఆ విద్యార్థినులు.. వెంటనే ఈ విషయం గురించి తమ పేరెంట్స్‌కి తెలియజేశారు. దీంతో వాళ్లు ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేయగా.. ఆయన అంతర్గత విచారణ జరిపించారు. ఈ విచారణలో ఆ టీచర్ నేరం రుజువు కావడంతో.. పోలీసులకు సమాచారం అందించారు.
KS Eshwarappa: అల్లా ఏమైనా చెవిటివాడా.. ‘అజాన్’పై బీజేపీ లీడర్ వివాదాస్పద వ్యాఖ్యలు
తమకు అందిన ఫిర్యాదు మేరకు.. పోలీసులు ఆ నిందితుడిపై సెక్షన్ 354 (నేరపూరిత బలవంతం), ఇతర సంబంధిత నియమాల ప్రకారం భారతీయ శిక్షాస్మృతిలోని ఇతర సంబంధిత నిబంధనల ప్రకారం ఫోక్సో చట్టం నమోదు చేశారు. బ్లాక్ ఎడ్యుకేషన్ అధికారి విచారణ జరిపిన అనంతరం.. ఆ నిందితుడ్ని మార్చి 11వ తేదీన అరెస్ట్ చేసినట్టు పోలీసు అధికారి తెలిపారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై విచారణ కొనసాగుతోందని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు.. విద్యార్థినుల తల్లిదండ్రులు ఆ ఉపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.