Site icon NTV Telugu

Crime: కాబోయే భార్య సె*క్స్‌కు ఒప్పుకోలేదని దారుణం..

Crime News

Crime News

Crime: మహారాష్ట్రలో దారుణం చోటు చేసుకుంది. మైనర్ బాలికపై ఓ వ్యక్తి అత్యాచారం చేసి, గొంతు నులిమి హత్య చేశాడు. మైనర్ బాలికతో నిందితుడైన వ్యక్తికి పెళ్లి నిశ్చమమైంది. అయితే, పెళ్లికి ముందే తనతో శారీరక సంబంధం పెట్టుకోవాలని నీలేష్ దోంగ్డా అనే వ్యక్తి, బాలికను వేధించాడు. ఇందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో ఆమెపై అత్యాచారం చేసి, హత్య చేశాడు.

Read Also: Mahindra cars: మహీంద్రా గుడ్ న్యూస్, కొత్త జీఎస్టీకి ముందే తగ్గిన కార్‌ల ధరలు..

పాల్ఘర్ జిల్లా బిబల్ధర్ గ్రామంలో నివసించే మైనర్ బాలికతో నిందితుడికి ఇటీవల ఎంగేజ్మెంట్ జరిగింది. బాధితురాలి తల్లిదండ్రులు పొలానికి వెళ్లిన సమయంలో నిందితుడు మధ్యాహ్నం బాలిక ఇంటికి వెళ్లాడు. తనతో సె*క్స్ చేయాలని బలవంతం చేశాడు. అందుకు ఆమె నిరాకరించింది. ఆ తర్వాత ఆమెపై అత్యాచారం చేసి గొంతు నులిమి హత్య చేసి చంపినట్లు పోలీసులు తెలిపారు.

ఘటన తర్వాత నిందితులు గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలోకి పారిపోయాడు. బాధితురాలి తల్లిదండ్రులు సాయంత్రం పొలం నుంచి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, వారి కుమార్తె చనిపోయి ఉన్నట్లు గుర్తించారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడిని కస్టడీకి పంపారు, బాధితురాలి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పంపినట్లు అధికారులు తెలిపారు.

Exit mobile version