దేశమంతా సంక్రాంతి పండగ వాతావరణం నెలకొంది. స్కూళ్లు, కాలేజీలు, హాస్టల్స్‌కు సెలవులు ఇవ్వడంతో పిల్లలంతా ఇళ్లకు చేరుకున్నారు. పట్టణం, పల్లెటూరు అన్న తేడా లేకుండా ప్రజలంతా పండగ సంబరాల్లో మునిగి తేలియాడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఫోన్ కొనివ్వలేదని మనస్తాపంతో కొడుకు పొలంలో చెట్టుకు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. కుమారుడిని వెతుక్కుంటూ పొలం వెళ్లిన తండ్రి.. బిడ్డ విగతజీవిగా పడి ఉండటాన్ని చూసి అదే ఉరి తాడు తగిలించుకుని ప్రాణాలు తీసుకున్నాడు. దీంతో కుటుంబంలో, గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. మహారాష్ట్రలోని నాందేడ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: Team India: ఇంగ్లాండ్తో టీ20 సిరీస్కి భారత జట్టు ఎంపిక.. తెలుగు కుర్రాళ్లకు చోటు
మహారాష్ట్రలోని నాందేడ్‌కు చెందిన 16 ఏళ్ల ఓంకార్ పదో తరగతి చదువుతున్నాడు. అయితే చదువు నిమిత్తం స్మార్ట్‌ఫోన్ కొనివ్వాలని తండ్రిని అడిగాడు. ఆర్థిక పరిస్థితులు బాగోలేకపోవడంతో తండ్రి ఫోన్ కొనివ్వలేకపోయాడు. దీంతో కుమారుడు.. పొలం వెళ్లి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం బిలోలి తహసీల్‌లోని మినాకిలోని వారి సొంత పొలంలో చెట్టుకు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. అయితే కుమారుడు తిరిగి ఇంటికి రాకపోవడంతో తండ్రి వెతుక్కుంటూ పొలం వెళ్లాడు. పొలంలో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్న కుమారుడు కనిపించగానే భోరున విలపించాడు. తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. వెంటనే కుమారుడి మృతదేహం కిందకు దింపి.. అదే ఉరి తాడు బిగించుకుని తండ్రి ప్రాణాలు తీసుకున్నాడు. ఒకేసారి తండ్రి, కొడుకు చనిపోవడంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇది కూడా చదవండి: kites: గాలిపటాలు ఎగిరేసేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోండి.. లేదంటే…
ముగ్గురు సోదరుల్లో ఓంకార్ ఒకరు. ఓంకార్ చిన్నవాడు. లాతూర్ జిల్లా ఉద్గీర్‌లోని హాస్టల్ ఉండి చదువుకుంటున్నాడు. సంక్రాంతి సెలవుల కోసం ఇంటికి వచ్చాడు. అయితే చదువుల నిమిత్తం ఫోన్ కొనివ్వాలని అడిగితే పేద తండ్రి కొనలేకపోయాడు. మనస్తాపంతో కుమారుడు ప్రాణాలు తీసుకున్నాడు. ఆవేదనతో తండ్రీ చనిపోయాడు. ఇలా కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
స్మార్ట్‌ఫోన్ కోసం బుధవారం గొడవ జరిగిందని ఓంకార్ తల్లి తెలిపింది. అయితే పొలం కోసం తీసుకున్న వాహన రుణం ఇంకా తీరలేదని.. ఆ బాకీ తీరాక స్మార్ట్‌ఫోన్ కొంటానని చెప్పినట్లు తెలిపింది. దీంతో మనస్తాపం చెంది ఓంకార్ చనిపోయాడని తల్లి చెప్పింది. పోలీసులు.. మృతదేహాలను ఆస్పత్రికి తరలించగా చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రమాదవశాత్తు మరణాలుగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: IPO : 2025 లో 90 కి పైగా ఐపిఓలు… పరిమాణం రూ.లక్ష కోట్ల పై మాటే