Site icon NTV Telugu

Maharastra: బాలికపై దారుణం .. ఐదు నెలల పాటు సామూహిక అత్యాచారం..

Untitled Design (2)

Untitled Design (2)

మహారాష్ట్రలోని థానే జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. 17 ఏళ్ల బాలికపై ఏడుగురు నిందితులు ఐదు నెలల పాటు సామూహిక అత్యాచారం చేశారు. సోషల్ మీడియాలో స్నేహం చేసి.. బాలికపై అత్యాచారానికి తెగబడ్డారు నిందితులు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని థానే జిల్లాలో 17 ఏళ్ల బాలికకు సంబంధించిన దిగ్భ్రాంతికరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఏడుగురు నిందితులు ఆమెపై ఐదు నెలల పాటు బ్లాక్‌మెయిల్ చేసి సామూహిక అత్యాచారం చేశారు. బాధితురాలికి వైద్య పరీక్షల్లో ఆమె గర్భం దాల్చినట్లు నిర్ధారించారు. నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు. పోలీసులు ఏడుగురు నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు.

స్నేహితులందరూ ముర్బాద్ , భివాండి ప్రాంతాలలోని సంపన్న కుటుంబాల నుండి వచ్చారని పోలీసులు తెలిపారు. వారు బాలికను లైంగికంగా వేధించారని. ఆమె నిరాకరిస్తే ఆమె అభ్యంతరకరమైన వీడియోలను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో పోస్ట్ చేస్తామని బెదిరించారని చెప్పుకొచ్చారు. ఐదు నెలల పాటు వేధింపులు కొనసాగాయని పోలీసులు వెల్లడించారు.

బాధితురాలి తల్లిదండ్రులు ఆమె అసభ్యకరమైన ఆడియో, వీడియో క్లిప్‌లను ఆన్‌లైన్‌లో చూసిన తర్వాత ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత ఆ బాలిక తన కుటుంబ సభ్యులకు తన బాధను వివరించింది. అందరూ పోలీసులను సంప్రదించి ఫిర్యాదు చేశారని అధికారి తెలిపారు.

ఏడుగురు నిందితులను కళ్యాణ్ జిల్లా సెషన్స్ కోర్టులో హాజరుపరిచారు, అక్కడ వారిని ఎనిమిది రోజుల పోలీసు కస్టడీకి తరలించారు. బాధితురాలి వైద్య పరీక్షలో ఆమె గర్భవతి అని తేలింది. నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు.

Exit mobile version