NTV Telugu Site icon

UP News: 12 ఏళ్ల బాలికపై మదర్సా టీచర్ అత్యాచారం.. బందీగా ఉంచి అఘాయిత్యం..

Up News

Up News

UP News: ఉత్తర్ ప్రదేశ్ గోరఖ్‌పూర్‌లో దారుణం జరిగింది. 12 ఏళ్ల బాలికను బందీగా చేసుకుని ఓ మదర్సా టీచర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. మౌల్వీ రహ్మత్ అలీ గోరఖ్‌పూర్‌లోని ఉరువా పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామంలోని మదర్సాలో బోధిస్తున్నాడు. రోజూలాగే 12 ఏళ్ల బాలిక సోమవారం ఉదయం చదువుకునేందుకు మదర్సాకు వెళ్లినట్లు అధికారులు వెల్లడించారు. తరగతులు ప్రారంభమైన సుమారు రెండున్నర గంటల తర్వాత, అలీ ఇతర పిల్లలందరిని ఇంటికి పంపాడు. అయితే, బాధిత బాలికను మాత్రం ఏదో నెపంతో అక్కడే ఉంచుకున్నాడు. ఆమెను బంధించి, అత్యాచారం చేశాడు. శబ్దం చేస్తే చంపేస్తానని బెదిరించాడు.

Read Also: Babita Phogat: కాంగ్రెస్ సీనియర్ నేతపై బబిత ఫైర్.. కుటుంబంలో గొడవలు సృష్టించారని ఆగ్రహం

ఇంటికి చేరుకున్న బాలిక మౌల్వీ(మతగురువు) చేసిన పనిని తన తల్లికి చెప్పింది. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ అత్యాచారం గురించి తెలిసిన స్థానికులు నిందితుడిని కొట్టి పోలీసులకు అప్పగించారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించామని, ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేశామని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (సౌత్) జితేంద్ర కుమార్ తెలిపారు. అలీపై పోక్సోతో పాటు ఇతర చట్టాల కింద కేసులు నమోదు చేశారు.

Show comments