NTV Telugu Site icon

MP Shocker: ఏడుస్తుందని ప్రియురాలి కుమార్తెను చంపేసిన వ్యక్తి..

Madhya Pradesh Shocker

Madhya Pradesh Shocker

MP Shocker: మధ్యప్రదేశ్‌లో దారుణం వెలుగులోకి వచ్చింది. ప్రియురాలి కుమార్తె రాత్రి సమయంలో ఏడ్చినందుకు ఓ వ్యక్తి పసికందును నేలకేసి కొట్టి హత్య చేశాడు. రాష్ట్రంలోని శివపుర జిల్లాలో ఆగస్టు 5న అర్ధరాత్రి ఈ సంఘటన జరిగింది. పసిబిడ్డ తల్లి నేరం గురించి ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బాలికను చంపేసిన వ్యక్తి ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.

బామోర్కల పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది. చనిపోయిన ఒకటిన్నర ఏళ్ల బాలికను ఛాయాగా పోలీసులు గుర్తించారు. ఆమె తల్లి జయంతి(35), నిందితుడు భయ్యాలాల్(25)లో కలిసి ఉంటుంది. ఛాయా తల్లి జయంతి ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. రాత్రి 10 గంటల సమయంలో రాత్రి భోజనం చేసి నిద్రపోయామని, అర్ధరాత్రి సమయంలో పాప లేసి ఏడ్చిందని, దీంతో నిద్ర పాడైందనే కోపంతో భయ్యాలాల్ పసిబిడ్డ అని చూడకుండా నేలకేసి కొట్టాడని చెప్పింది. చిన్నారి నోరు, తల నుంచి తీవ్ర రక్తస్రావం జరిగిందని, ఆ తర్వాత నిందితుడు చిన్నారి గొంతు నులిమి హత్య చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. బాలిక తల్లి జయంతి రాత్రంతా చనిపోయిన పాప శరీరాన్ని తన ఛాతీపై పెట్టుకుని ఉందని పోలీసులు తెలిపారు.

Read Also: Viral Video: కామాంధుడి తిక్కకుదిర్చిన అమ్మాయి.. నడిరోడ్డుపై.?

ప్రేమికుడితో కలిసి జీవించేందుకు సదరు మహిళ తన పసిపాపతో భర్తను విడిచిపెట్టినట్లు తెలిసింది. ఛాయా మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. ఈ హత్య గురించి జయంతి అత్తకు సమాచారం అందించారు. అయితే, ఆమె భర్త పరమానంద్‌ని పోలీసులు సంప్రదించలేకపోయారు. ఇద్దరు కూలీ పనిచేసుకుంటూ బెంగళూర్‌లో కలిశారని, పదేళ్ల క్రితం వివాహం చేసుకున్న జయంతి 20 రోజుల క్రితం భర్తను వదిలేసి ప్రియుడి వద్దకు వచ్చిందని పోలీసులు తెలిపారు. జయంతికి ముగ్గురు సంతానం కాగా ఛాయా చిన్నది. బెంగళూర్ నుంచి శివపురి వచ్చే సమయంలో ఛాయాను తీసుకుని వచ్చిందని, వీరిద్దరు భార్యభర్తలుగా జిల్లాలోని ఓ గ్రామంలో జీవిస్తున్నారని పోలీసులు తెలిపారు.

Show comments