Exam Paper: ‘డార్లింగ్.. నీ కోసం పరీక్ష పేపర్లు లీక్ చేస్తా’ అంటూ.. విద్యార్థినిని లైంగికంగా వేధించిన ప్రొఫెసర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విద్యాబుద్ధులు నేర్పి సమాజంలో ఉన్నత స్థానంలో నిలబెట్టాల్సిన ఒక విశ్వవిద్యాలయ ప్రొఫెసర్.. విద్యార్థిని పట్ల కీచకుడిగా మారిన వైనం లక్నో యూనివర్సిటీలో తీవ్ర కలకలం రేపింది. పరీక్షా పత్రాలను లీక్ చేస్తాననే నెపంతో, ఒక బీఎస్సీ విద్యార్థినిని లైంగికంగా లొంగదీసుకోవడానికి ప్రయత్నించిన అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉదంతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. బాధితురాలు ధైర్యంగా ప్రొఫెసర్ బాగోతాన్ని ఆడియో రికార్డింగుల రూపంలో బయటపెట్టడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.
ఘోరానికి ఒడిగట్టిన ప్రొఫెసర్..
లక్నో యూనివర్సిటీ జువాలజీ విభాగానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ పరంజిత్ సింగ్, ఒక విద్యార్థినిని మానసికంగా, లైంగికంగా వేధించాడు. “నీ కోసం రెండు క్వశ్చన్ పేపర్లు తెచ్చాను, నన్ను కలవడానికి ఎప్పుడు వస్తావు?” అంటూ సదరు ప్రొఫెసర్ ఫోన్ లో వేధించడం ఆ ఆడియోలో స్పష్టమైంది. దానికి ఆ విద్యార్థిని “నేను సిలబస్ అంతా చదివేసాను సర్.. అవి నాకు అనవసరం లేదు” అని చెప్పినా వినకుండా, పరీక్షలకు వారం రోజుల ముందే తనను ఒంటరిగా కలవాలని సదరు ప్రొఫెసర్ తీవ్ర ఒత్తిడి తెచ్చాడు. గతంలో కూడా తనను లొంగదీసుకోవడానికి ప్రయత్నించాడని, కేవలం తనను శారీరకంగా వేధించడానికే ప్రొఫెసర్ పిలుస్తున్నాడని ఆ విద్యార్థిని ఆవేదన వ్యక్తం చేసింది.
Also Read
- Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
- Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
- Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
- Anakapalli Tragedy: అనకాపల్లిలో విషాదం.. బాలిక, యువకుడి మృతితో విషాదం.. అసలేం జరిగింది?
ధైర్యం చేసిన బాధితురాలు ఆడియో క్లిప్‌లను యూనివర్సిటీ అధికారులకు సమర్పించడంతో, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ప్రొఫెసర్ పరంజిత్ సింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే వర్సిటీ అంతర్గత రాజకీయాల వల్లే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ప్రొఫెసర్ బుకాయించాడు.
మరోవైపు ఈ ఘటనపై అఖిల భారత విద్యార్థి పరిషత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితుడిపై కఠిన చట్టాల కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ క్యాంపస్‌లో పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టింది. స్పందించిన వైస్ ఛాన్సలర్ జేపీ సైనీ.. అంతర్గత కమిటీని ఏర్పాటు చేసి 24 గంటల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించారు. సంస్థ ప్రతిష్టను దెబ్బతీసే ఇలాంటి చర్యలను ఎంతమాత్రం సహించేది లేదని వర్సిటీ స్పష్టం చేసింది.
తాజావార్తలు
-
Mandadi: కమెడియన్ అనుకుంటే స్టార్ హీరోల కటౌట్లే షేక్ చేశాడు! రూ.100 కోట్ల క్లబ్‌లోకి ‘మందాడి’..
-
Kartikeya Gummakonda : తన ‘కమ్‌బ్యాక్’ కోసం మెగాఫోన్ పట్టిన ‘ఆర్ఎక్స్ 100’ హీరో..
-
Trump vs Media: వార్తా సంస్థలను ‘కేన్సర్’తో పోల్చిన ట్రంప్.. కోర్టుకెళ్లనున్న మీడియా సంస్థలు
-
CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
-
Ponguleti: పేదోడి ఆత్మగౌరవమే ఇందిరమ్మ టవర్స్ లక్ష్యం
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!