Honour killing: హిందూ యువకుడితో ప్రేమ.. కుమార్తెను ముక్కలుగా నరికి చంపిన తండ్రి..
- లక్నోలో దారుణహత్య..
- హిందూ యువకుడిని ప్రేమిస్తోందని కుమార్తె హత్య..
- ముక్కలుగా నరికి చంపిన తండ్రి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Honour killing: లక్నో రైల్వే స్టేషన్లో ఛప్రా-గోమతినగర్ ఎక్స్‌ప్రెస్ రైలులో దొరికిన యువతి డెడ్‌బాడీ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. స్లీపర్ కోచ్‌లో బెర్తు కింద ఒక పెట్టెలో చేతులు, కాళ్లు నరికేసిన స్థితిలో మృతదేహం లభ్యమైంది. మృతురాలిని 16 ఏళ్ల బాలికగా గుర్తించారు. సొంత తండ్రే దారుణంగా హత్య చేసినట్లు తేలింది.
తన కుమార్తె హిందూ యువకుడితో మాట్లాడుతోందని, ప్రేమిస్తోందని అనుమానించిన తండ్రి బిగ్గన్ అన్సారీ ఈ హత్యకు పాల్పడ్డాడు. మతం వేరు కావడంతో అతడితో మాట్లాడవద్దని పలుమార్లు హెచ్చరించినప్పటికీ వినకపోవడంతో, పరువు పోతుందనే ఉద్దేశంలో అతను ఈ హత్యకు పాల్పడ్డాడు. అయితే, ఈ కుటుంబంలో అప్పటికే పెద్ద కుమార్తె హిందూ వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఇంకో కుమార్తె కూడా హిందూ వ్యక్తిని పెళ్లిచేసుకుంటుందనే భయంతో ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
Also Read
- Bengaluru: ఖాళీ స్థలాన్ని క్లీన్ చేస్తుండగా మహిళ మృతదేహం.. 20 రోజుల తర్వాత వీడిన మర్డర్ మిస్టరీ..
- AP Crime: కళ్యాణి హత్య కేసులో షాకింగ్ విషయాలు.. మటన్‌తో కొట్టే కత్తులతో ముక్కలుగా నరికి కెనాల్లో పడేశారు..!
- Bihar Girl Harassment: బీహార్‌లో వరుస ఘటనలు.. తాజాగా టూరిస్ట్ స్పాట్లో బాలికకు వేధింపులు.. వీడియో వైరల్
- AP and TG Crime: మాదాపూర్ ఓయోలో యువతి మృతి కేసులో ట్విస్ట్.. విశాఖలో యువకుడి ఆత్మహత్యాయత్నం
Read ALSO: AP: ఏపీ ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నూతన కమిటీ నియామకం..
ఇది ఆవేశంతో జరిగిన హత్య కాదని, పక్కా ప్లానింగ్‌తోనే హత్య చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ఘటనకు 5 రోజుల ముందే నిందితుడు తన భార్య, ఇద్దరు కొడుకులను బంధువుల ఇంటికి పంపించాడు. నిందితుడు తన సోదరి, బావతో కలిసి హత్యకు కుట్ర పన్నారు. హత్య తర్వాత, కుమార్తె శరీరాన్ని ఆరు ముక్కలుగా నరికినట్లు పోలీస్ విచారణలో తేలింది. తలను గ్రామ చెరువులో పారేయగా, చేతులు కాళ్లను వేర్వేరుగా పాలిథీన్ సంచుల్లో ప్యాక్ చేసి, ఒక పెట్టెలో పెట్టి రైలులో స్లీపర్ కోచ్‌లో ఉంచాడు.
రైల్వే స్టేషన్, రైలులోని సీసీటీవీ కెమెరాలు నిందితుడిని పట్టుకోవడానికి మార్గాన్ని సుగమం చేశాయి. అనుమానిత వ్యక్తి ఒక పెట్టెను మోసుకెళ్తున్నట్లు కనిపించింది. పోలీసులు బాలిక తలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది.
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!