Karnataka: పెళ్లికి నిరాకరించిందని విద్యార్థిని గొంతు కోసి చంపిన ప్రేమోన్మాది..
- కర్ణాటకలో ప్రేమోన్మాది ఘాతుకం..
- పెళ్లికి నిరాకరించిందని విద్యార్థిని గొంతు కోసం హత్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka: కర్ణాటకలో దారుణం జరిగింది. పెళ్లికి ఒప్పుకోలేదని ఓ ప్రేమోన్మాది యువతి గొంతు కోసి చంపాడు. ఈ ఘటన రాష్ట్రంలోని రాయచూర్ జిల్లా సింధనూర్‌లో జరిగింది. పట్టపగలే ఈ దారుణం జరిగింది, నేరం చేసిన తర్వాత నిందితుడు పోలీసుల ముందు లొంగిపోయాడు. మరణించిన విద్యార్థిని షిఫా(24)గా గుర్తించారు. నిందితుడు టైల్స్ దుకాణంలో పనిచేసే ముబిన్‌గా గుర్తించారు.
సింధనూర్ పట్టణంలోని ఒక ప్రైవేట్ కాలేజీలో ఎంఎస్సీ చదువుతున్న షిఫా, లింగసగురు నుంచి ప్రతీ రోజు కాలేజీకి వస్తూపోతూ ఉండేదని పోలీసులు తెలిపారు. ఆమెకు 6 ఏళ్లుగా నిందితుడితో పరిచయం ఉందని, ఆ సమయంలో నిందితుడు ఆమె పట్ల ప్రేమను పెంచుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే, ఇటీవల షిఫాకు వేరే వ్యక్తితో వివాహం గురించి ఇంట్లో చర్చలు ప్రారంభించారు. ఈ విషయం తెలుసుకున్న ముబిన్ తనను వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేశాడు. షిఫా దీనికి నిరాకరించింది.
Also Read
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
Read Also: CM Revanth Reddy : ప్రభుత్వ పాఠశాల్లో AI ఆధారిత డిజిటల్ విద్య.. సర్కార్ కీలక నిర్ణయం
పెళ్లికి నిరాకరించిందనే కోపంతో నిందితుడు లింగసగురు నుంచి ఆమెను వెంబడించి సింధనూర్ ప్రభుత్వ గ్రాడ్యుయేట్ కాలేజీ సమీపంలో ఆమెపై దాడి చేశాడు. మెడపై కత్తితో పొడిచి, ఆపై గొంతు కోసం అక్కడి నుంచి పరారయ్యాడు. హత్య చేసిన తర్వాత, షిఫాను పెళ్లి చేసుకోబోతున్న వ్యక్తి దుకాణానికి వెళ్లి గొడవపడ్డాడు. ఈ ఘటన తర్వాత నిందితుడు లింగసగురు పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు.
గతేడాది ఏప్రిల్ నెలలో హుబ్బళ్లి నగరంలో ఎంసీఏ విద్యార్థి నేహ హిరేమత్‌ని ఫయాజ్ అనే వ్యక్తి కత్తితో దాడి చేసి చంపాడు. ఎన్నికల ముందు ఈ సంఘటన చర్చనీయాంశంగా మారింది. మే నెలలో అంజలి అంబిగేర అనే యువతిని విశ్వ అనే వ్యక్తి కొత్తితో పొడిచి చంపాడు.
తాజావార్తలు
-
Dhruv Rathee: “గుండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
-
Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
-
Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
-
Dragon : రామోజీఫిల్మ్ సిటీలో వేటకు టైగర్ రెడీ..14 నుండి షూటింగ్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!