CM Revanth Reddy : ప్రభుత్వ పాఠశాల్లో AI ఆధారిత డిజిటల్ విద్య.. సర్కార్ కీలక నిర్ణయం
- రాష్ట్రంలో విద్యా ప్రమాణాల పెంపుకు పాఠశాల విద్యలో AI ఆధారిత డిజిటల్ విద్య
- నందన్ నీలేకని 'ఎక్ స్టెప్-ఫౌండేషన్' సేవలు
- ఏఐ డిజిటల్ విద్యకు శ్రీకారం చుట్టనున్న సీఎం రేవంత్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy : ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ ను పూర్తి స్థాయిలో ఉపయోగించడం ద్వారా రాష్ట్రంలో పాఠశాల విద్యలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టనున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకంలో పాఠశాల విద్యను మరింత నాణ్యతా ప్రమాణాలతో అందించడానికి గాను ఆర్టిఫిషల్ ఇంటిలిజెన్స్ ( ఏ.ఐ ), డిజిటల్ ఇనీషియేటివ్స్ లను పాఠశాల విద్య శాఖ పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలని నిర్ణయించింది. విద్యార్థులలో మరింత మెరుగైన అభ్యాస పద్దతులను, సాంకేతిక ప్రమాణాలను పెంపొందించడం లాంటి వినూత్న కార్యక్రమాలను ప్రవేశ పెట్టనున్నారు.
దీనిలో భాగంగా, బెంగుళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఎక్ స్టెప్ -ఫౌండేషన్ ను రాష్ట్ర విద్యా శాఖ కార్యదర్శి డా. యోగితా రాణా నేతృత్వంలో ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం నేడు (30 వ తేదీ ) సందర్శించింది. ఈ ప్రతినిధి బృందంలో రాష్ట్ర ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ కమీషనర్ కృష్ణ ఆదిత్య, పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ ఈవీ నర్సింహా రెడ్డి, అసిస్టెంట్ కలెక్టర్లు ఉమా హారతి, గరిమ తదితరులున్నారు. విద్యా రంగంలో డిజిటల్ పద్దతులను ప్రవేశపెట్టడం ద్వారా విద్యార్థులలో విద్యా పరమైన నాణ్యతా ప్రమాణాలను పెంపొందించడంలో ఎక్ స్టెప్- ఫౌండేషన్ అగ్రగామిగా ఉంది.
Also Read
- Ind Vs Afg: ఆఫ్ఘనిస్థాన్‌తో తొలి టీ20 మ్యాచ్.. అద్భుత పోరాటం చేసిన ఒమర్జాయ్..
- Best Investment Scheme: పథకం చిన్నదే.. కానీ కోటీశ్వరులను చేస్తుంది.. 18 ఏళ్లు నిండిన వారు అర్హులు..
- Dinesh Karthik: టెస్టు క్రికెట్‌ను పాకిస్థాన్ మర్చిపోవడం మంచిది.. ఘోరమైన స్థితిలో పాక్ జట్టు..
- Ravi Shastri: పుతిన్, మోడీ, జిన్‌పింగ్.. బ్రిక్స్‌పై రవిశాస్త్రి సంచలన పోస్ట్..
ఎక్ స్టెప్- ఫౌండేషన్ – విజనరీ టెక్నోక్రాట్, ఫిలాంత్రపిస్ట్, ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ అయినా నందన్ నీలేకని ఈ ఎక్ స్టెప్-ఫౌండేషన్ కు కో-ఫౌండర్ గానూ ఉన్నారు. విద్యా, వైద్యం, వ్యవసాయ రంగాల్లో డిజిటల్ పద్దతులను ప్రవేశపెట్టి మరింత మెరుగైన సేవలను అందించడానికి ఈ ఎక్ స్టెప్- ఫౌండేషన్ ప్రారంభించారు. ఈ ఫౌండేషన్ ఇప్పటికే గుజరాత్, కర్ణాటక, ఒడిస్సా, పంజాబ్, తమిళనాడు రాష్ట్రాలలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో కలసి పనిచేస్తోంది.
నేడు, గురువారం నాడు, బెంగుళూర్ లో ఎక్ స్టెప్- ఫౌండేషన్ ప్రతినిధులతో కలసి తెలంగాణా విద్యా శాఖ ప్రతినిధి బృందం విద్యారంగంలో చేపట్టాల్సిన పలు ఇన్షియేటివ్ లపై చర్చించింది.
ఫౌండషనల్ లిటరసీ, న్యూమెరసీ (FLN): ప్రాథమిక విద్యా స్థాయిలో ఆర్టిఫిషల్ ఇంటిలిజెన్స్ ఆధారిత డిజిటల్ పద్ధతుల ద్వారా ప్రాథమిక స్థాయిలో రాయడం, చదవడం, సంఖ్యా పరమైన విజ్ఞానాన్ని పెంపొందించుకోవడం.
AI – Powered Digital Initiatives : ఏ.ఐ ఆధారిత టూల్స్, ప్లాటుఫామ్ లను ప్రవేశ పెట్టడం ద్వారా విద్యార్థులలో వ్యక్తిగత స్థాయిలో విద్యా ప్రమాణాలు, అభ్యాస పద్ధతులను మరింతగా మెరుగుపర్చడం.
Data – Driven Insights : విద్యార్థుల్లో ఉన్న అభ్యసన లోపాలను గుర్తించి, వాటి ని సవరించడానికి తగు ఇనిషియేటివ్ లని ప్రవేశ పెట్టడం.
ఉపాధ్యాయులలో వృత్తిపరమైన ప్రమాణాలను పెంపొందించడం : పాఠశాల గదుల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా ఉపయోగించడానికి ఉపాధ్యాయులకు డిజిటల్ పద్దతులపై పూర్తి స్థాయిలో శిక్షణ అందించడం.
ఎక్ స్టెప్ -ఫౌండేషన్ ను సందర్శించిన, రాష్ట్ర విద్యా శాఖ ప్రతినిధి బృందం 2024 లో కేరళ రాష్ట్రాన్ని సందర్శించి అక్కడి విద్యా రంగంలో చేపట్టిన ఆధునిక పద్దతులను పరిశీలించింది. కేరళ ప్రభుత్వం కూడా తన రాష్ట్ర విద్యా శాఖలో ఏ.ఐ టూల్స్ లను పూర్తిస్థాయిలో వినియోగించుకొని మెరుగైన విద్యా ప్రమాణాలను సాధించిందని ఈ బృందం పరిశీలనలో గుర్తించింది. ఈ బెస్ట్ ప్రాక్టీసులను కూడా తెలంగాణా విద్యా శాఖలో ప్రవేశపెట్టాలని నిర్ణయించారు.
ఎక్ స్టెప్ -ఫౌండేషన్ భాగస్వామ్యంతో ఈ ఏ.ఐ ఆధారిత విద్యను ప్రవేశ పెట్టడానికి తెలంగాణ సమగ్ర ప్రణాలికను రూపొందిస్తోంది. డిజిటల్ ఇనిషియేటివ్స్, ప్రాథమిక స్థాయిలో అభ్యసన నైపుణ్యాల పెంపు, విద్యార్థులు, ఉపాధ్యాయులకు స్నేహపూర్వక అభ్యసన పద్ధతుల్లో సహాయం అందించడం రంగాల్లో ఈ ప్రణాళిక ను రూపొందిస్తున్నారు.
Union Budget 2025: భారత బడ్జెట్ చరిత్రలో “అతిపెద్ద”, “అతిచిన్న” బడ్జెట్ ప్రసంగాలు ఇవే..
తాజావార్తలు
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
-
Ind Vs Afg: ఆఫ్ఘనిస్థాన్‌తో తొలి టీ20 మ్యాచ్.. అద్భుత పోరాటం చేసిన ఒమర్జాయ్..
-
Best Investment Scheme: పథకం చిన్నదే.. కానీ కోటీశ్వరులను చేస్తుంది.. 18 ఏళ్లు నిండిన వారు అర్హులు..
-
Vijay – Trisha: దళపతి విజయ్ అలా ఎందుకు చేశాడు? పాపం త్రిష! వీడియో వైరల్..
-
Dinesh Karthik: టెస్టు క్రికెట్‌ను పాకిస్థాన్ మర్చిపోవడం మంచిది.. ఘోరమైన స్థితిలో పాక్ జట్టు..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!