Site icon NTV Telugu

Body Found In Freezer: వెలుగులోకి మరో హనీమూన్ కేసు.. ఐస్ క్రీం ఫ్రీజర్‌లో శవం..

Tripura

Tripura

Body Found In Freezer: మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. పెళ్లై రెండు వారాలు గడవక ముందే భర్తను భార్య దారుణంగా చంపించింది. ఈ ఘటన మరువక ముందే ఈశాన్య రాష్ట్రానికి చెందిన త్రిపురలో ఇలాంటి ఘటన మరోక్కటి జరగడంతో.. స్థానికంగా ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతుంది. అగర్తాలాలోని ఇంద్రానగర్ ప్రాంతానికి చెందిన ఒక యువకుడి మిస్సింగ్ వెనుక ఉన్న సిక్రెట్ ను పోలీసులు ఛేదించారు.

Read Also: Midhun Reddy: లిక్కర్ కేసులో మిథున్ రెడ్డికి ఎదురుదెబ్బ.. హైకోర్టులో కీలక విచారణ..!

అయితే, త్రిపురలోని ధలై జిల్లాలోని గండచెర్రా మార్కెట్‌లో ఐస్‌ క్రీం ఫ్రీజర్‌లో దాచిన ట్రాలీ బ్యాగ్‌లో ఒక యువకుని శవం దొరికింది. ఆ మృతదేహాం ఎవరిది అని పోలీసులు ఆరా తీయగా.. అగర్తాలా స్మార్ట్ సిటీ మిషన్ ప్రాజెక్ట్‌లో ఎలక్ట్రీషియన్‌గా వర్క్ చేస్తున్న సరిఫుల్ ఇస్లాం అనే యువకుడిదిగా గుర్తించారు. ఈ హత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ సందర్భంగా సరిఫుల్ ఒక అమ్మాయితో ప్రేమలో ఉన్నాడని తేలింది.. అయితే, ఇక్కడే అసలై ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది.. ఆ అమ్మాయి బంధువు దిబాకర్ సాహా కూడా ఆమెను ప్రేమిస్తున్నాడు. వారి ముగ్గురి మధ్య ట్రైయాంగిల్ లవ్ స్టోరీనే ఈ హత్యకు కారణమని పోలీసులు గుర్తించారు.

Read Also: US: ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడి చేసే ఛాన్స్.. అమెరికా హై అలర్ట్

ఇక, సరిఫుల్ ఇస్లాం హత్య కేసులో ఆ డాక్టర్‌, అతని తల్లిదండ్రులతో సహా ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో మరో మహిళ పాత్ర కూడా ఉందని తేలింది. జూన్ 8వ తేదీన సాయంత్రం డాక్టర్‌ దిబాకర్ సాహా.. సరిఫుల్‌ను సౌత్ ఇంద్రానగర్ కబర్‌ఖలా ప్రాంతానికి రమ్మని పిలవగా.. అక్కడి జోయ్‌దీప్ దాస్(20) ఇంట్లో ఓ గిఫ్ట్ ఇస్తానని చెప్పాడు. అతని మాటతో సరిఫుల్ అక్కడకు వెళ్లాడు.. దీంతో దిబాకర్, అతని స్నేహితులు అనిమేష్ యాదవ్(21), నబనితా దాస్(25), ఇస్లాంపై దాడి చేశారు. అతన్ని గొంతు నరికి దారుణంగా చంపేశారు. ఆ తరువాత శవాన్ని ఒక ట్రాలీ బ్యాగ్‌లో ప్యాక్ చేసి.. ఆ తర్వాత రోజు ఉదయం దిబాకర్‌తో పాటు అతని తల్లిదండ్రులు దీపక్, దేబికా సాహాలు అగర్తాలాకు మృతదేహం ఉన్న ట్రాలీ బ్యాగ్‌ను తీసుకెళ్లి.. గండచెర్రా మార్కెట్‌లోని వారి దుకాణంలో ఉన్న ఐస్ క్రీం ఫ్రీజర్‌లో దాచి పెట్టారు.

Read Also: Laya : నా సొంతింటికి తిరిగి వచ్చినట్లు ఉంది..

కాగా, విషయం తెలుసుకున్న పోలీసులు.. నిందితులను రెండు రోజుల్లో అరెస్ట్ చేశారు. మంగళవారం రాత్రి ఆరుగురు నిందితులను అరెస్టు చేయగా.. బుధవారం మధ్యాహ్నం సరిఫుల్ ఇస్లాం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని.. పోస్టుమార్టం కోసం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇక, నిందితులను ఈ రోజు ( జూన్ 12) కోర్టు ముందు హాజరు పర్చనున్నారు పోలీసులు. ముగ్గురి మధ్య నడిచిన ప్రేమ వ్యవహారమే ఈ దారుణ హత్యకు కారణమని త్రిపుర వెస్ట్ పోలీస్ సూపరింటెండెంట్ కిరణ్ కుమార్ అన్నారు.

Exit mobile version