Love marriage: తమ్ముడి ప్రేమ పెళ్లి, అన్న ముక్కు కోసే వరకు వెళ్లింది. రాజస్థాన్‌లో ప్రేమ వివాహం విషాదంగా మారింది. వరుడి సోదరుడిపై దాడి చేసిన యువతి కుటుంబీకులు అతడి ముక్కును కోసేశారు. దానికి ప్రతీకారంగా, వరుడి కుటుంబ సభ్యులు యువతి మామపై గొడ్డలితో కాళ్లపై దాడి చేశారు. ఈ సంఘటన బుధవారం జరిగింది.
Read Also: Thiruparankundram Lamp Row: “హిందువులు ఆలోచించాలి”.. మధురై ఆలయ దీపం వివాదం.. వ్యక్తి ఆత్మహత్య..
రెండున్నరేళ్ల క్రితం, బార్మర్‌కు చెందిన 25 ఏళ్ల శ్రావణ్ సింగ్ తన పొరుగున ఉన్న ఒక మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.పెళ్లిని యువతి కుటుంబం అంగీకరించలేదు. శ్రవణ్ సింగ్ తన భార్య, కుటుంబంతో కలిసి గుజరాత్‌లో స్థిరపడ్డాడు. గత రెండున్నరేళ్లుగా పగ తీర్చుకునేందుకు యువతి కుటుంబం అదును కోసం చూస్తోంది. శ్రవణ్ అన్న యూకే సింగ్ తన పొలాన్ని చూసేందుకు వెళ్లినప్పుడు మహిళ మామ ధరం సింగ్ అతనిపై కత్తితో దాడి చేశాడు. ధరం సింగ్ అతడి అనుచరులు కత్తితో పొడిచి, యూకే సింగ్ ముక్కు కోసేశారు.
ఈ సంఘటన గురించి తెలుసుకున్న యూకే సింగ్ కుటుంబసభ్యులు, ధరం సింగ్ ఇంటికి వెళ్తుండగా అతడిపై దాడి చేశారు. గొడ్డలితో దాడి చేసి అతడిని తీవ్రంగా గాయపరిచారు. ఈ సంఘటన తర్వాత, పోలీసులు ఏడుగురిని అరెస్ట్ చేశారు. శ్రావణ్ కుటుంబం నుండి పోలీసులు నారాయణ్ సింగ్, ఆలం సింగ్, జాలం సింగ్‌లను అరెస్టు చేశారు. యువతి కుటుంబం నుంచి శంకర్ సింగ్, శైతాన్ సింగ్, తన్ సింగ్, సుమేర్ సింగ్‌లను అరెస్టు చేశారు.
