NTV Telugu Site icon

Love couple: ప్రేమజంట ఆత్మహత్య.. నిన్న ప్రియుడు, నేడు ప్రియురాలు..

Suicide

Suicide

ప్రేమించుకున్నారు.. కానీ, వారికి పెళ్లికి కులం అడ్డంగా మారింది.. దీంతో.. ఆ ప్రేమ జంట ప్రాణాలు తీసుకుంది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కనుకులలో ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది… అయితే, ఆ ఇద్దరూ మైనర్లుగానే తెలుస్తోంది.. గత కొంతకాలంగా కనుకుల గ్రామానికి చెందిన ఇద్దరు ప్రేమించుకుంటున్నారు.. ఈ విషయం పెద్దల వరకు చేరింది.. కానీ, ఇద్దరి కులాలు వేరు కావడంతో అడ్డుచెప్పారు పెద్దలు.. పెళ్లికి ఒప్పుకునేది లేదని ఇరు కుటుంబాలు స్పష్టం చేశాయి.. దీంతో మనస్తాపం చెందిన ప్రియుడు శివ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయగా.. సోమవారం రోజు మృతిచెందాడు.. ఇక, ఈ వార్త ప్రియురాలికి తెలియడంతో.. ప్రియుడి మరణాన్ని తట్టుకోలేక బావిలో దూకి ప్రియురాలు కూడా ఆత్మహత్య చేసుకుంది. వరుస ఘటనలు రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపాయి.

Read Also: GST: జీఎస్‌టీ శ్లాబ్‌ రేట్ల మార్పు..! క్లారిటీ ఇచ్చిన కేంద్రం..