Crime: ‘‘లాఫింగ్ ఎమోజీ’’ ఒకరి హత్యకు కారణమైంది. వివరాల్లోకి వెళితే గుజరాత్ రాజ్‌కోట్‌లోని ఒక ఫ్యాక్టరీలో బీహార్‌కు చెందిన 20 ఏళ్ల ప్రిన్స్ కుమార్ అతని ముగ్గురు బంధువులు పనిచేస్తున్నారు. నాలుగు నెలల క్రితంత తన తాత రూప్‌నారాయణ్ భింద్ మరణించారు. ఆయనను గుర్తు చేసుకుంటూ, ప్రిన్స్ ఒక ఫేస్‌బుక్ పోస్ట్ పెట్టాడు. అయితే, ప్రిన్స్‌కు పరిచయస్తుడైన బిపిన్ కుమార్ రాజిందర్ గోండ్ ఈ పోస్టుకు ‘‘నవ్వుతున్న ఎమోజీ’’ని పెట్టాడు. దీంతో ఇది ఇద్దరి మధ్య ఘర్షణకు కారణమైంది.
Read Also: GST 2.0 Complaint Process: ప్రజలకు గుడ్ న్యూస్.. జీఎస్టీ రేట్లు తగ్గించకపోతే.. ఈ పని చేయండి
ఫోన్‌లో మొదలైన వాగ్వాదం, భౌతిక ఘర్షణగా మారింది. ఎఫ్ఐఆర్ ప్రకారం, సెప్టెంబర్ 12 రాత్రి 12.30 గంటల ప్రాంతంలో ప్రిన్స్ తాను పనిచేస్తున్న ఫ్యాక్టరీ నుంచి ఆటో రిక్షాలో ఇంటికి వెళ్తున్న సమయంలో బిపిన్ అడ్డగించాడు. ప్రిన్స్ ఫ్యాక్టరీ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించాడు, అయితే మరో నిందితుడు బ్రిజేష్ గోండ్ అతడిని అడ్డుకుని చంపేస్తామని బెదిరించారు. ఇంతలో బిపిన్ ప్రిన్స్‌ను కత్తిలో పొడిచాడు.
ప్రిన్స్ అరుపులు విన్న వెంటనే అతడి సహచరులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ఆస్పత్రికి తరలించారు. ప్రిన్స్ వీపుపై తీవ్రమైన గాయమైంది. ఆస్పత్రిలో పోలీసులకు తన వాంగ్మూలాన్ని అందించాడు. నాలుగు రోజుల తర్వాత పరిస్థితి విషమించడంతో మరణించాడు. ఈ కేసులో నిందితులు ఇద్దరిపై హత్యా నేరం మోపబడింది. ప్రధాన నిందితుడు బిపిన్ ను పోలీసులు అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపరిచారు. మరో నిందితుడు బ్రిజేష్ పరారీలో ఉన్నాడు.
