Live-in relationship: సహజీవనం విషాదంగా మారుతోంది. లివ్ ఇన్ రిలేషన్‌లో ఉన్న వారు హత్యలకు గురవుతున్నారు. దేశ రాజధానిలో శ్రద్ధా వాకర్ హత్య ఈ కోవకే చెందుతుంది. ఆమె పార్ట్‌నర్ అఫ్తాబ్ పూనావాల అత్యంత కిరాతంగా శ్రద్ధాను హత్య చేయడం దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆ తర్వాత నుంచి పలు సందర్భాల్లో లివ్ రిలేషన్‌లో ఉన్న మహిళలు హత్యలకు గురయ్యారు.
మరోసారి లివ్ ఇన్ రిలేషన్ మర్డర్ జరిగింది. అయితే, ఈ సారి బాధితుడు మాత్రం పురుషుడు. కోల్‌కతాలో ఓ మహిళ తన లివ్ ఇన్ పార్ట్‌నర్‌ని కత్తితో పొడిచి చంపింది. ఆ తర్వాత నేరాన్ని పోలీసులకు వెల్లడించింది. ఈ ఘటన బుధవారం చోటు చేసుకుంది. కాల్ అందుకున్న తర్వాత పోలీసుల టీమ్ డమ్‌డమ్ ప్రాంతంలోని సంహతి పాల్ అనే మహిళ నివాసానికి చేరుకుంది. అప్పటికే అక్కడ కత్తి పోట్లతో సార్థక్ దాస్ రక్తపు మడుగులో పడి ఉంది. సమీపంలోని ఆస్పత్రికి తరలించగా, మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.
Read Also: BJP Lok Sabha Candidates: 100 అభ్యర్థుల జాబితా సిద్ధం చేసిన బీజేపీ.. జాబితాలో తెలంగాణ రాష్ట్రం..
సార్థక్ దాస్ ఒక ఫోటో గ్రాఫర్, అతను సంహతి పాల్ అనే మహిళతో రిలేషన్‌షిప్‌లో ఉన్నాడు. సంహతి వృత్తిరీత్యా మేకప్ ఆర్టిస్ట్. దాదాపుగా 30 ఏళ్ల వయసు ఉన్న ఈ జంట కొంత కాలంగా రిలేషన్‌షిప్‌లో సమస్యలను ఎదుర్కొంటున్నారు. బుధవారం ఉదయం ఆ మహిళ దాస్‌ను పదునైన కత్తితో పలుమార్లు పొడిచిందని పోలీసులు తెలిపారు. విచారణలో నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. అయితే, ఏ కారణంగా ఆమె హత్య చేసిందనే వివరాలు అస్పష్టంగా ఉన్నాయి. హత్యానేరం కింద మహిళను అరెస్ట్ చేశారు.
