Crime: బర్త్ డే సెలబ్రేట్ చేస్తామని నమ్మించి, ఓ మహిళపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. శుక్రవారం రోజు కోల్‌కతాలో ఈ సంఘటన జరిగింది. ఇద్దరు తెలిసిన వ్యక్తులు తనపై అత్యాచారానికి పాల్పడినట్లు హరిదేశ్ పూర్‌కు చెందిన 20 ఏళ్ల మహిళ ఆరోపించింది. చందన్ మల్లిక్, ద్వీప్ బిశ్వాస్‌గా గుర్తించబడిన నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Read Also: లోపల మేము గొడవ చేస్తేనే రిలీజ్ చేశారు – జైలు విడుదల తర్వాత ధనుంజయ రెడ్డి స్పందన
బాధిత మహిళతో నిందితుడు చందన్ మల్లిక్‌తో కొన్ని నెలల క్రితం పరిచయం ఏర్పడింది. దక్షిణ కోల్‌కతా పూజా కమిటీ అధిపతి అని చెప్పుకున్న మల్లిక్, ఆ తర్వాత ఆమెను దీప్‌కు పరిచయం చేశాడు. ఇద్దరూ కూడా కమిటీలో ఆమెకు ప్రాధాన్యత ఇస్తామనే హామీ ఇచ్చారు. ముగ్గురూ కూడా తరుచుగా మాట్లాడుకునే వారు. సంఘటన జరిగిన రాత్రి, నిందితుడు, మహిళను రీజెంట్ పార్క్ ప్రాంతంలో ఓ ఫ్లాట్‌కు తీసుకెళ్లాడు, అక్కడే వారు భోజనం చేశారు. ఆమె ఇంటికి వెళ్లడానికి ప్రయత్నం చేసినప్పుడు, వారు ఆమెను గదిలోనే బంధించి, అత్యాచారం చేసినట్లు మహిళ ఆరోపించింది. తర్వాతి రోజు ఉదయం ఆమె తప్పించుకుని ఇంటికి తిరిగి వచ్చింది. బాధితురాలు హరిదేశ్ పూర్ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసింది. ఈ కేసులో దర్యాప్తు సాగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.
