Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..

  • మహారాష్ట్ర కొల్హాపూర్‌లో దారుణం..
  • పెళ్లి కుదిరిందని చెప్పినందుకు ప్రియురాలి హత్య..
  • లోయలోకి తోసి చంపిన ప్రియుడు..
Crime

Crime

Maharashtra: మహారాష్ట్రలో కేతన్ హత్య గురించి ఎవరూ అంత ఈజీగా మరిచిపోరు. కేతన్‌కు కాబోయే భార్య సియా లోహగడ్ కోట పైనుంచి తోసి చంపేసింది. సరిగా ఇలాగే మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. అయితే, ఇక్కడ ప్రియురాలిని ప్రియుడు లోయలోకి తోసి చంపేశాడు. పోలీసులు చెబుతున్న దాని ప్రకారం.. 25 ఏళ్ల శ్రీపద్ దింకర్ వాడుగా తన ప్రియురాలు 23 ఏళ్ల తరణుమ్ బషీర్ నాయక్‌ను హత్య చేశాడు.

తరుణమ్‌కు ఇటీవల వివాహం నిశ్చయం కావడంతో, శ్రీపద్‌తో తన ప్రేమ బంధాన్ని తెంచుకోవాలని కోరుకుంది. దీంతో పగ పెంచుకున్న శ్రీపద్, తరణుమ్‌ను శుక్రవారం నాయక్‌వాడి సమీపంలోని ఒక లోయలోకి తోసి చంపేశాడు. వీరిద్దరు కొల్హాపూర్ జిల్లా గర్గోటిలోని అవధూత్ కాలనీలో ఎదురెదురు ఇళ్లలో ఉండేవారు. ఆ సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. తరణుమ్ మహాగావ్‌లోని ఒక ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతోంది.

కొంతకాలం క్రితమే ఆమెకు పెళ్లి కుదిరింది. ఈ విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో తరణుమ్‌ను హత్య చేయాలని పక్కా ప్లాన్‌తో చంపేశాడు. అయితే, లోయలో తోసిన తర్వాత అమ్మాయి కనిపించడం లేదని చెప్పి పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడు. పోలీసులు క్షుణ్ణంగా విచారణ జరపడంతో నేరాన్ని అంగీకరించినట్లు సమాచారం.