Khiladi Lady : బంధువే కదా ఆశ్రయమిస్తే నగలు, డబ్బుతో పరార్
- ఆమె పేరు చెరకుపల్లి లక్ష్మీ స్వరాజ్
- ఇంట్లో ఉన్న విలువైన ఆభరణాలపై కన్నేసింది
- నిమ్మరసంలో మత్తు పదార్థం కలిపి ఇచ్చింది
- మణికంఠశర్మ, హేమబిందు స్పృహ కోల్పోయారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంధువే కదా ఆశ్రయమిస్తే రాబంధువుగా మారింది. ఇంట్లో చోటిచ్చిన పాపానికి బంగారు నగలు, డబ్బు అంతా ఊడ్చుకెళ్లింది. ఆ కిలాడీ లేడీ అంతర్గతంగా వేసిన స్కెచ్ గుర్తు పట్టని ఆ దంపతులు.. సొమ్ము పోయిన తర్వాత లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. సీన్ కట్ చేస్తే జస్ట్ 24 గంటల్లోనే కిలాడీ లేడీని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లో ఇదే జరిగింది. బీహెచ్ఈఎల్ కాలనీ పరిధిలోని ఆదర్శనగర్‌లో పురోహితులైన యర్రవల్లి మణికంఠశర్మ, హేమబిందు దంపతుల ఇంటికి వచ్చింది ఓ మహిళ. ఆమె పేరు చెరకుపల్లి లక్ష్మీ స్వరాజ్. తాను తీవ్రమైన ఆర్థిక కష్టాల్లో ఉన్నానని, ఉండటానికి చోటు లేక ఇబ్బంది పడుతున్నానని ప్రాధేయపడింది. బంధుత్వంపై ఉన్న గౌరవం.. ఆమె పరిస్థితిపై ఉన్న జాలితో ఆ దంపతులు ఆమెకు తమ ఇంట్లోనే ఉండేందుకు ఆశ్రయం ఇచ్చారు…
కొన్ని రోజులు.. ఆ దంపతుల నమ్మకాన్ని గెలుచుకుంది లక్ష్మీస్వరాజ్. వారి ఇంట్లో ఒక మనిషిగా ఉన్నట్లుగానే మెదిలింది. కానీ ఆ తర్వాత ఆమె తన కన్నింగ్ ఆలోచనలకు తెరతీసింది. ఇంట్లో ఉన్న విలువైన ఆభరణాలపై కన్నేసింది. మార్చి 13న వాటిని కొట్టేసేందుకు ప్లాన్ చేసింది. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం.. ఆ దంపతులకు నిమ్మరసంలో మత్తు పదార్థం కలిపి ఇచ్చింది. ఆ పానీయం తాగిన కొద్దిసేపటికే మణికంఠశర్మ, హేమబిందు ఇద్దరూ స్పృహ కోల్పోయారు. వారు అపస్మారక స్థితిలోకి వెళ్లగానే.. లక్ష్మీస్వరాజ్ తన ముఠా సభ్యులైన పర్వతం కిరణ్‌కుమార్, కోనపర్తి యశ్వంత్, భారడి దీపక్, శివను ఆ ఇంటికి రప్పించింది…
Also Read
- Video: ప్రాణాలకు తెగించి దొంగలను తరిమికొట్టిన నగలషాపు సిబ్బంది.. వీడియో వైరల్..
- Family: రూ.2వేలు అద్దె చెల్లించలేక.. యజమాని వద్దకు భార్య, కూతుర్ని పంపి..
- Exam Paper: ‘డార్లింగ్.. నీ కోసం పరీక్ష పేపర్లు లీక్ చేస్తా’ అంటూ.. విద్యార్థినిని లైంగికంగా వేధించిన ప్రొఫెసర్..
- Kakinada Accident: ఉపాధి కూలీలపైకి దూసుకెళ్లిన టిప్పర్.. అక్కడికక్కడే నలుగురు మహిళల మృతి
ముఠా సభ్యులతో కలిసి ఇంట్లోని అల్మారాలను బద్దలుకొట్టి దాదాపు 30 తులాల బంగారం, 2.3 కిలోల వెండి, 3 ఖరీదైన సెల్ఫోన్లను ఎత్తుకెళ్లారు. బాధితులు స్పృహలోకి వచ్చేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇంట్లో సామాన్లు చిందరవందరగా పడి ఉండటం.. లక్ష్మీస్వరాజ్ కనిపించకపోవడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు వెంటనే బాలానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు..
కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. కాలనీలోని సీసీ కెమెరాల ఫుటేజీ, నిందితులు వాడిన వాహనాల నంబర్లు, సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా దర్యాప్తును ముమ్మరం చేశారు. కేవలం 24 గంటల వ్యవధిలోనే ప్రధాన నిందితురాలు లక్ష్మీస్వరాజ్తో పాటు మిగిలిన నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి దోచుకెళ్లిన పూర్తి బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు… బంధువులైనా, తెలిసిన వారైనా సరే ఇంటికి వచ్చినప్పుడు పూర్తి జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా ఆర్థిక స్థితిగతులు, బంగారం ఎక్కడ దాస్తారో వంటి వ్యక్తిగత విషయాలను ఎవరికీ వెల్లడించవద్దని కోరారు. ఆపదలో ఉన్నారని నమ్మి అపరిచితులకు లేదా దూరపు బంధువులకు ఆశ్రయం ఇచ్చే ముందు వారి ప్రవర్తనను గమనించాలని హెచ్చరించారు…
తాజావార్తలు
-
CBSE: త్రిభాషా విధానంపై సీబీఎస్ఈ సంచలన నిర్ణయం
-
KKR Vs GT: పక్కా వ్యూహంతో బరిలోకి కోల్‌కతా నైట్ రైడర్స్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న జీటీ..
-
MS Dhoni: బిగ్ అప్డేట్.. సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌కి ధోనీ ఎంట్రీ..
-
Jihadi drug: భారత్‌లో తొలిసారి పట్టుబడ్డ ‘‘జిహాదీ డ్రగ్’’.. ఇది ఎంత ప్రమాదకరమంటే..
-
Video: ప్రాణాలకు తెగించి దొంగలను తరిమికొట్టిన నగలషాపు సిబ్బంది.. వీడియో వైరల్..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..