Kerala: కేరళలో దారుణం జరిగింది. 16 ఏళ్ల మైనర్ బాలుడిపై పదే పదే లైంగిక దాడికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో కేరళ పోలీసులు 9 మందిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో ఒక రాజకీయ నాయకుడు, ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు, ఒక ఫుట్ బాల్ కోచ్ ఉన్నారు. నిందితులు గే డేటింగ్ యాప్‌లో సదరు బాలుడితో స్నేహం చేసినట్లు తెలుస్తోంది. కాసర్ గోడ్ పోలీస్ చీఫ్ విజయ భరత్ రెడ్డి ఈ సంఘటన గురించి మీడియాకు వెల్లడించారు.
10వ తరగతి చదువుతున్న విద్యార్థిపై 2 ఏళ్లుగా ఈ అఘాయిత్యం జరుగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. గే డేటింగ్ యాప్‌ను బాలుడు డౌన్‌లోడ్ చేసున్నట్లు తెలుస్తోందని, కాసర్ గోడ్, కన్నూర్, కోజికోడ్, ఎర్నాకుళం లోని 14 మంది వ్యక్తులు రెండుళ్లుగా అతడిపై లైంగిక దాడి చేస్తున్నట్లు అనుమానిస్తున్నట్లు తెలిపారు.
Read Also: Shahid Afridi: రాహల్ గాంధీపై షాహీద్ అఫ్రిది ప్రశంసలు, మోడీ ప్రభుత్వంపై విమర్శలు..
‘‘బాలుడి ఇంట్లో, ఇతర జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో అతడిపై అత్యాచారం జరిగింది. బాలుడి తల్లి తన ఇంట్లో నుంచి అనుమానాస్పదంగా ఒకరు పరిగెత్తడం చూడటంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. ఆమె తన కొడుకును ప్రశ్నించినప్పుడు, అసలు విషయం వెల్లడించాడు. తల్లి వెంటనే చైల్డ్ హెల్ప్‌లైన్ ను సంప్రదించి, పోలీసులకు సమాచారం ఇచ్చింది’’ అని భరత్ రెడ్డి తెలిపారు. బాలుడి వాంగ్మూలం ప్రకారం, పోలీసులు 16 మంది పోక్సో కేసు నమోదు చేశారు. ఈ కేసును దర్యాప్తు చేయడానికి డీఎస్పీ, నలుగురు ఇన్స్‌పెక్టర్ల నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. 14 మంది అనుమానితులు 25-51 ఏళ్ల మధ్య ఉన్నవారు.ఒకరు రైల్వే ఉద్యోగి కూడా నిందితుడిగా ఉన్నాడు.
