కరూర్ లో తొక్కిసలాటకు ప్రధాన కారణం విజయ్ ఆలస్యంగా రావడమే…అని తమిళనాడు రాష్ట్ర డీజీపీ వెంకటరామన్ అన్నారు. పదివేల మందికి అనుమతి కోరి దాదాపు 30 వేల మంది వరకు అక్కడ జనాన్ని సమకూర్చారు.600 మంది వరకు తాము పోలీసుల రక్షణ కల్పించామని ఆయన తెలిపారు.
పూర్త వివరాల్లోకి వెళితే… కరూర్ ర్యాలీకి మేము విధించిన ఏ నిబంధనలను టీవీకే పార్టీ విజయ్ పాటించలేదని తమిళనాడు రాష్ట్ర డీజీపీ వెంకటరామన్ తెలిపారు. మేము భద్రత కల్పించాం కాబట్టే హైవే నుండి కరూర్ ర్యాలీ ప్రాంగణానికి విజయ్ చేరుకున్నారని ఆయన అన్నారు. పోలీసులు లేకుంటే ర్యాలీ ప్రాంగణానికి రాకుండా పోయేవాడినని విజయ్ స్వయంగా సభలో తమకు కృతజ్ఞతలు తెలిపారని ఆయన అన్నారు. కరూర్ లో తొక్కిసలాటకు ప్రధాన కారణం విజయ్ ఆలస్యంగా రావడమే…అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యాహ్నం12 గంటలకు ర్యాలీ అని ట్వీట్ చేసి…. 7 గంటల 20 నిమిషాలకు విజయ్ ర్యాలీ వద్దకు చేరుకున్నారు..దీంతో భారీగా అక్కడ జన సమీకరణ చేశారు. పదివేల మందికి అనుమతి కోరి దాదాపు 30 వేల మంది వరకు అక్కడ జనాన్ని సమకూర్చారు.600 మంది వరకు తాము పోలీసుల రక్షణ కల్పించాం..నివేదిక ఆధారంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీజీపీ వెంకటరామన్ తెలిపారు.
మరోవైపు.. టీవీకే పార్టీ అధ్యక్షుడు హీరో విజయ్ ఇంటి వద్ద భారీ భద్రతా ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. విజయ్ కి వ్యతిరేకంగా స్వచ్ఛంద సంస్థలు ఆయన ఇంటి ముందు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. మరి కొందరు కార్యకర్తలు విజయ్ కి మద్దతుగా రావడతో పోలీసులు వారిని అడ్డుకున్నారు.