Karnataka: పిల్లలు లేరన్న కోపంతో భార్యను చంపిన భర్త.. హార్ట్ ఎటాక్‌గా చిత్రీకరించి చివరికీ..
- పెళ్లై మూడేళ్లు అయింది..
- పిల్లలు లేకపోవడంతో భార్యభర్తల మధ్య గొడవ..
- కోపంలో భార్యను చంపేసిన భర్త.. హార్ట్ ఎటాక్ గా చిత్రీకరణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka: కర్ణాటకలోని బెలగావి జిల్లా నెగినహాల్ గ్రామంలో జరిగిన ఘోర విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది. రాజేశ్వరి ఫకీరప్ప గిలక్కణవర మృతి మొదట హార్ట్ అటాక్‌గా చిత్రికరించినప్పటికీ, చివరకు అది హత్యగా తేలింది. ఈ దారుణానికి ఆమె భర్త ఫకీరప్ప గిలక్కణవర పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. కాగా, రాజేశ్వరి మృతి చెందిన తర్వాత, ఆమెకు గుండెపోటు వచ్చి చనిపోయిందని భర్త అందరికీ చెప్పాడు. అంత్యక్రియల కోసం బంధువులను స్వగ్రామానికి పిలిచాడు. అయితే, అంత్యక్రియలకు వచ్చిన రాజేశ్వరి తల్లిదండ్రులు ఆమె మెడపై ఉన్న గాయాలను గమనించి.. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందజేశారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజేశ్వరి- ఫకీరప్పకు మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. పిల్లలు లేరన్న కారణంతో భర్త ఆమెను వేధించేవాడని ఆరోపించారు. ఈ విషయంపై తరచూ ఇంట్లో గొడవలు జరుగుతుండేవని చెప్పుకొచ్చారు.
Read Also: Ajith Kumar : రెండేళ్లకో సినిమాతో కనిపిస్తున్న అజిత్.. సినిమాలపై ఎందుకు కాన్సన్‌ట్రేషన్ చేయట్లేదు
Also Read
- Bihar Girl Harassment: బీహార్‌లో వరుస ఘటనలు.. తాజాగా టూరిస్ట్ స్పాట్లో బాలికకు వేధింపులు.. వీడియో వైరల్
- AP and TG Crime: మాదాపూర్ ఓయోలో యువతి మృతి కేసులో ట్విస్ట్.. విశాఖలో యువకుడి ఆత్మహత్యాయత్నం
- UP Crime News: యువతిపై సామూహిక అత్యాచారం.. నలుగురు పోలీసు, సీఆర్పీఎఫ్ సిబ్బంది అరెస్ట్
- Tragedy: స్లీపర్ బస్సు అగ్నికి ఆహుతి.. 9 మంది ప్రయాణికులు మృతి
అయితే, హత్య గురించి తెలిసిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ప్రాథమిక విచారణ చేపట్టారు. ఇది సహజ మరణం కాదని, హత్య అయ్యే అవకాశం ఉందని అనుమానించి రాజేశ్వరి భర్త ఫకీరప్పను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఈ సందర్భంగా కోపోద్రిక్తుడైన ఫకీరప్ప రాజేశ్వరిని గొంతు పిసికి హత్య చేసినట్లు అంగీకరించినట్టు పోలీసుల విచారణలో తేలింది. అనంతరం ఈ హత్యను హార్ట్ ఎటాక్‌గా చూపించేందుకు ప్రయత్నించినట్లు వెల్లడించారు. అయితే, రాజేశ్వరి మృతదేహాన్ని బెలగావి BIMS ఆసుపత్రికి పోస్ట్‌మార్టం కోసం తరలించారు. పోస్ట్‌మార్టం నివేదికలో ఇది హత్యేనని నిర్ధారణ అయ్యింది. దీంతో ఫకీరప్పపై హత్య కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచిన అనంతరం బీఎన్ఎస్ లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. పోస్ట్‌మార్టం ప్రక్రియ పూర్తయ్యాక రాజేశ్వరి మృతదేహాన్ని ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు.
తాజావార్తలు
-
Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
-
POVA New Mobile: POVA 8 5G మొబైల్ ఫోన్ లాంచ్.. 8000mAh బ్యాటరీ, 144Hz రిఫ్రెష్ రేట్, FHD+ ఫ్లాట్ LCD స్క్రీన్..
-
IND vs WI: రుతురాజ్, నితీష్ ఇన్.. ఆ ఇద్దరు స్టార్లకు నో ఛాన్స్.. వెస్టిండీస్‌తో తొలి వన్డేకు భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Minister Satyakumar Yadav: వారికి తప్పకుండా అవకాశం ఇస్తాం.. మంత్రి సత్యకుమార్ కీలక వ్యాఖ్యలు
-
D56 : నాగవంశీ – ధనుష్ – తమిళరసన్ పచ్చముత్తు.. మొదలుపెట్టారు
-
Khairatabad Ganesh Immersion: ముగిసిన ఖైరతాబాదు వినాయకుడి శోభయాత్ర.. గంగమ్మ ఒడిలోకి చేరుకున్న బడా గణపయ్య.!
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!