Site icon NTV Telugu

Karnataka: ఎంగేజ్‌మెంట్ ఆగిందని అమ్మాయి తలనరికి హత్య.. శవంగా కనిపించిన నిందితుడు..

Karnatka

Karnatka

Karnataka: కర్ణాటక కొడుగు జిల్లాలో ఎంగేజ్‌మెంట్ నిలిచిపోయిందని 16 ఏళ్ల బాలిక తల నరికి, ఆ తలతో పారిపోయిన వ్యక్తి ఉదంతం సంచలనంగా మారింది. ప్రకాష్ అనే 32 ఏళ్ల వ్యక్తి, 10వ తరగతి చదువుతున్న 16 ఏళ్ల మీనాతో వివాహం జరగాల్సి ఉంది. అయితే, అమ్మాయి మైనర్ కావడంతో అధికారులకు సమాచారం ఇవ్వడంతో జరగాల్సిన ఎంగేజ్‌మెంట్ ఆగిపోయింది. దీంతో బాలిక కుటుంబ సభ్యులు పెళ్లికి నిరాకరించారు. దీంతో కోపం పెంచుకున్న ప్రకాష్, బాలిక తల్లిదండ్రులపై దాడి చేయడంతో పాటు బాలికను ఇంటి నుంచి 100 మీటర్ల దూరం ఏడ్చుకెళ్లి తల నరికి, ఆ తలతో పరారయ్యాడు.

Read Also: Arvind Kejriwal: ‘‘నియంతృత్వం నుంచి దేశాన్ని రక్షించాలి’’.. జైలు నుంచి విడుదల తర్వాత కేజ్రీవాల్..

పరారైన ప్రకాష్ కోసం పోలీసులు వెతుకుతుండగా.. నిందితుడు శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. అతని నివాసానికి సమీపంలో మృతదేహం లభ్యమైంది. బాలిక నిశ్చితార్థాన్ని మహిళా మహిళా శిశు అభివృద్ధి శాఖ అధికారులు నిలిపివేశారు. అధికారులు కూడా అమ్మాయి తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి రద్దు చేసుకున్నారు. తర్వాతి రోజు ప్రకాష్ ఈ దారుణానికి ఒడిగట్టారు. ప్రస్తుతం గాయపడిన బాలిక తల్లికి చికిత్స కొనసాగుతోంది. అయితే, బాలిక తల ఇప్పటి వరకు లభ్యం కాలేదు. దానిని కనుగొనేందుకు పోలీసులు వెతుకుతున్నారు. నిందితుడు ఆత్మహత్య చేసుకున్న కొడుగు జిల్లాలోని హమ్మియాల ప్రాంతంలోని అతని ఇంటి పరిసరాల్లో విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నారు.

Exit mobile version