Karnataka: ఎంగేజ్‌మెంట్ ఆగిందని అమ్మాయి తలనరికి హత్య.. శవంగా కనిపించిన నిందితుడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka: కర్ణాటక కొడుగు జిల్లాలో ఎంగేజ్‌మెంట్ నిలిచిపోయిందని 16 ఏళ్ల బాలిక తల నరికి, ఆ తలతో పారిపోయిన వ్యక్తి ఉదంతం సంచలనంగా మారింది. ప్రకాష్ అనే 32 ఏళ్ల వ్యక్తి, 10వ తరగతి చదువుతున్న 16 ఏళ్ల మీనాతో వివాహం జరగాల్సి ఉంది. అయితే, అమ్మాయి మైనర్ కావడంతో అధికారులకు సమాచారం ఇవ్వడంతో జరగాల్సిన ఎంగేజ్‌మెంట్ ఆగిపోయింది. దీంతో బాలిక కుటుంబ సభ్యులు పెళ్లికి నిరాకరించారు. దీంతో కోపం పెంచుకున్న ప్రకాష్, బాలిక తల్లిదండ్రులపై దాడి చేయడంతో పాటు బాలికను ఇంటి నుంచి 100 మీటర్ల దూరం ఏడ్చుకెళ్లి తల నరికి, ఆ తలతో పరారయ్యాడు.
Read Also: Arvind Kejriwal: ‘‘నియంతృత్వం నుంచి దేశాన్ని రక్షించాలి’’.. జైలు నుంచి విడుదల తర్వాత కేజ్రీవాల్..
Also Read
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
పరారైన ప్రకాష్ కోసం పోలీసులు వెతుకుతుండగా.. నిందితుడు శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. అతని నివాసానికి సమీపంలో మృతదేహం లభ్యమైంది. బాలిక నిశ్చితార్థాన్ని మహిళా మహిళా శిశు అభివృద్ధి శాఖ అధికారులు నిలిపివేశారు. అధికారులు కూడా అమ్మాయి తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి రద్దు చేసుకున్నారు. తర్వాతి రోజు ప్రకాష్ ఈ దారుణానికి ఒడిగట్టారు. ప్రస్తుతం గాయపడిన బాలిక తల్లికి చికిత్స కొనసాగుతోంది. అయితే, బాలిక తల ఇప్పటి వరకు లభ్యం కాలేదు. దానిని కనుగొనేందుకు పోలీసులు వెతుకుతున్నారు. నిందితుడు ఆత్మహత్య చేసుకున్న కొడుగు జిల్లాలోని హమ్మియాల ప్రాంతంలోని అతని ఇంటి పరిసరాల్లో విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నారు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!