Site icon NTV Telugu

మొబైల్ కొట్టేశాడని… తలకిందులుగా వేలాడదీసి చితక్కొట్టారు

కర్ణాటకలోని మంగుళూరులో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. మొబైల్ దొంగతనం చేశాడనే ఆరోపణలతో ఏపీకి చెందిన ఓ మత్స్యకారుడి పట్ల సహచర మత్స్యకారులు దారుణంగా ప్రవర్తించారు. వివరాల్లోకి వెళ్తే… ఏపీకి చెందిన వైల శీను మంగళూరులో మత్స్యకారుడిగా పనిచేస్తున్నాడు. అయితే ఇటీవల ఓ వ్యక్తి ఫోన్ కనిపించలేదు. దీంతో వైల శీనునే ఆ మొబైల్ దొంగిలించాడని మిగతా మత్స్యకారులు భావించారు. ఈ నేపథ్యంలో ఫోన్ ఎక్కడ పెట్టావంటూ పదే పదే ప్రశ్నిస్తూ.. కనీసం వైల శీను చెప్పేది వినకుండా అతడిని తలకిందులుగా వేలాడదీసి చితక్కొట్టారు.

Read Also: ఫ్యాక్ట్ చెక్: డిసెంబర్ 31 వరకు భారత్ బంద్

కర్ణాటకలో పండేశ్వర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటనలో ఏపీకి చెందిన వైల శీను తీవ్రంగా గాయపడినట్లు స్థానికులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు మంగళూరు పోలీసులు తెలిపారు. అయితే శీనును కొట్టింది ఏపీకి చెందిన మత్స్యకారులే అని పేర్కొన్నారు. ఈ కేసులో ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెప్పారు.

Exit mobile version