Tragedy : వివాహేతర బంధాలు హత్యకు దారి తీస్తున్నాయి. దేశంలోని ఏ కేసు తీసుకున్నా.. ఇదే జరుగుతోంది. తాజాగా కరీంనగర్ శివారులో జరిగిన ఓ మర్డర్ కేసును పోలీసులు ఛేదించారు. ఈ హత్య వెనుక వివాహేతర బంధమే కారణమని తేల్చారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కరీంనగర్ శివారు ప్రాంతంమైన బొమ్మకల్‌లోని రైల్వే ట్రాక్ వద్ద జులై 29న ఓ డెడ్ బాడీ కనిపించింది. దీన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వ్యక్తి డెడ్ బాడీని.. కరీంనగర్‌లోని సుభాష్‌నగర్‌కు చెందిన ఐలవేణి సంపత్‌దిగా గుర్తించారు పోలీసులు. ఈ మృతి అనుమానాస్పదంగా ఉండడం.. సంపత్ కుమారుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు..
ఐతే ఈ కేసు దర్యాప్తులో పోలీసులకు సంచలన విషయాలు తెలిశాయి. పక్కా మర్డర్‌గా విచారణలో తేలింది. ముఖ్యంగా హత్యలో సంపత్ భార్య ఐలవేణి రమాదేవి హస్తం ఉందని అనుమానించారు. ఆ దిశగా విచారణ చేయడంతో అసలు విషయం వెలుగు చూసింది… కొన్నాళ్లుగా రమాదేవికి కిసాన్ నగర్‌కు చెందిన కర్రె రాజయ్యతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం కాస్తా భర్త సంపత్‌కు తెలిసింది. దీంతో ఇంట్లో గొడవలు షురూ అయ్యాయి. అంతే కాదు ఇదే విషయంపై ఆగ్రహంతో ఉన్న సంపత్ నిత్యం మద్యం తాగుతూ బానిసగా మారాడు. అంతే కాదు మద్యం మత్తులో రమాదేవిని కొడుతుండేవాడు. ఫలితంగా విసిగిపోయిన రమాదేవి.. సంపత్ హత్యకు స్కెచ్ వేసింది. అనుకున్నదే తడవుగా ప్రియుడు రాజయ్యతోపాటు దూరపు బంధువైన ఖాదర్ గూడెంకు చెందిన కీసరి శ్రీనివాస్‌తో కలిసి ప్లాన్ చేసింది…
Hyderabad: నగరం నడిబొడ్డులో పట్ట పగలే హత్య.. కత్తులతో దారుణంగా నరికి…
ప్లాన్ ప్రకారం జులై 29న రాజయ్య, శ్రీనివాస్ కలిసి సంపత్‌ను బొమ్మకల్ ఫ్లైఓవర్ వద్దకు రమ్మన్నారు. అక్కడే అతనికి బాగా మద్యం తాగించారు. సంపత్ పూర్తిగా మత్తులోకి వెళ్లాడని భావించిన తర్వాత.. అతని భార్య రమాదేవికి ఫోన్ చేశారు. చంపేయమని చెప్పడంతో.. నిందితులు తమ వెంట తెచ్చుకున్న గడ్డి మందును సంపత్ చెవిలో పోశారు. అతడు చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత డెడ్ బాడీని రైల్వే ట్రాక్ పక్కన పడేసి వెళ్లిపోయారు…
ఇక సంపత్.. కనిపించడం లేదని భార్య రమాదేవి ఇంటి దగ్గర డ్రామా షురూ చేసింది. ఆ డ్రామాలో నిందితులు కూడా పాల్గొన్నారు. అతన్ని వెతుకుతున్నట్లు నటించారు. అంతా కలిసి డ్రామా రక్తి కట్టించినప్పటికీ.. పోలీసులు స్ట్రాంగ్‌గా దర్యాప్తు చేయడంతో దొరికిపోయారు…
Shocking : మైక్రోప్లాస్టిక్స్ మెదడులో పేరుకుపోతున్నాయా..? కొత్త అధ్యయనంలో షాకింగ్ నిజాలు..!
