Karimnagar Loan Scam: అప్పు పుట్టాలంటే.. ఆస్తులు తాకట్టు పెట్టాలి. అంతే కాదు.. బ్యాంకులు అడిగిన అన్ని డాక్యుమెంట్లు సమర్పించాలి. లక్షల్లో లోన్ కావాలంటే సవాలక్ష ప్రశ్నలు అడుగుతారు. దీంతో బ్యాంకుల చుట్టూ లోన్స్ కోసం తిరిగే వారు.. ఆయా అధికారులు చెప్పే కండీషన్స్ ఫుల్ ఫిల్ చేయలేక.. తర్వాత రుణాలు రాక.. ఏదైనా పని చేసుకుందామంటే చేతిలో డబ్బులు లేక దిక్కులు చూస్తుంటారు. సరిగ్గా అలాంటి వాళ్లను టార్గెట్ చేశాడు దోమల రమేష్ అనే వ్యక్తి. కరీంనగర్ జిల్లా గంగాధరలో అంజనీపుత్ర లోన్స్ అండ్ ఇన్సూరెన్స్ కన్సల్టెన్సీ పేరుతో దుకాణం తెరిచాడు…
READ ALSO: Extramarital Affair: భార్య చేతిలో మరో భర్త హతం.. ఇంకా నిద్ర లేవడం లేదని డ్రామా ఆడి..!
ఇల్లు, ఫ్లాటు కొనడానికి, రేకుల షెడ్డు, కట్టిన ఇంటి పైన, ఇల్లు రిపేర్ చేసుకోవడానికి, ఓపెన్ ప్లాట్ మార్టిగేజ్, ఇదివరకు ఉన్న లోన్స్ పైన టాపప్.. ఇలా అన్ని అంశాలకు లోన్స్ ఇప్పిస్తామని ప్రచారం చేసుకున్నాడు రమేష్. ఇంకేముంది ఆయన దుకాణం ముందు చాలా మంది క్యూ కట్టారు. వారి దగ్గర నుంచి తలా రూ. 5300 వరకు టోకెన్ అమౌంట్ కాజేశాడు. ఓ బాధితుని వద్ద రూ. 15 లక్షలు లోన్ ఇప్పిస్తామని చెప్పి రూ. 66వేలు కొట్టేశాడు. అలా డబ్బు చెల్లించిన వారు లోన్స్ కోసం అడిగితే..ఇదిగో అదిగో అని తప్పించుకుని తిరుగుతున్నాడు. మొత్తంగా 25 మంది బాధితులు తయారయ్యారు. తమ లోన్స్ ఇప్పించకపోవడంతో అందరూ కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. దోమల రమేష్‌ను అరెస్ట్ చేశారు.
మరోవైపు గంగాధర మండలంలో కొంతమంది రూ. 2700 లు కడితే నిత్యావసర సరుకులు ఇస్తామని చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇలాంటి వాళ్లు ఎవరైనా కనిపిస్తే… తమకు ఫిర్యాదు చేయాలని చెబుతున్నారు పోలీసులు…
READ ALSO: Vikarabad murder: మర్డర్ మిస్టరీ.. అర్ధనగ్నంగా మహిళ మృతదేహం
