Site icon NTV Telugu

Kanpur: కూతురితో తిరుగుతున్నాడని.. యువకుడి కిడ్నాప్ చేసిన లాయర్..

Up

Up

Kanpur: తన కూతురితో కలిసి తిరుగుతున్న యువకుడిపై ఓ తండ్రి దారుణంగా వ్యవహరించాడు. ఉత్తర్ ప్రదేశ్ కాన్పూర్‌కి చెందిన లాయర్ తన కుమార్తెతో కలిసి తిరుగున్న ఫార్మా విద్యార్థిని కిడ్నాప్ చేయించి, అతని మనుషులతో దారుణంగా చిత్రహింసలు పెట్టాడు. దారుణంగా కొట్టడంతో తీవ్ర గాయాలపాలయ్యారు. విద్యార్థిని పోలీసులు రక్షించగా, నిందితుడైన లాయర్‌ని అరెస్ట్ చేశారు. 8 మందితో కూడిన టీం విద్యార్థిని కిడ్నాప్ చేసి, తీవ్రంగా కొట్టి, చిత్రహింసలకు గురి చేశారు.

Read Also: Sharad Pawar: మహారాష్ట్ర ఎన్నికల్లో మేం కలిసి పోరాడుతాం.. శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు..

జరిగిన సంఘటనను విద్యార్థి పోలీసులకు వివరించాడు. అతను ఇంకా షాక్ నుంచి కోలుకోలేదు. కారులో వచ్చిన 8 మంది తనను కిడ్నాప్ చేశారని, అడవిలోకి తీసుకెళ్లి కర్రలు, ఇనుపరాడ్లు, బెల్టులతో కొట్టినట్లు తెలిపాడు. అతని గోళ్లను లాగి చిత్రహింసలకు గురిచేవారు. చెవి దగ్గర పదేపదే ఇనుప రాడ్‌తో దాడి చేశారు. తనపై దాడి చేసిన వ్యక్తులు, చంపేసి మృతదేహాన్ని గంగా నదిలో పారేస్తామని బెదిరించారని పోలీసులకు వెల్లడించారు. ఈ ఘటనలో అమ్మాయి తండ్రి నిందితుడని తేలింది. అతడిని అరెస్ట్ చేశారు. తీవ్రంగా గాయపడిన యువకుడిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.

Exit mobile version